Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gold Rate: లక్షణంగా లక్షకు చేరువలో బంగారం..!?

–యమ దూకుడు మీదున్న బంగారం ధరలు
–గుప్పుమంటున్న తులం బంగారo రూ. లక్షకు చేరుతుందన్న వార్తలు
–నిన్నామొన్నటి వరకు రూ. 80 వే ల వరకు చేరుకున్న తులం కాస్తo త తగ్గుముఖం

Gold Rate:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో పసిడి (gold)ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉందoటే అతి శయోక్తి కాదు.బంగారానికి ప్రస్తుత మున్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యే కంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారాన్ని కేవలం ఒక అలంకరణ వస్తువుగానే కాకుండా పెట్టుబడి వస్తువుగా భావించే వారు రోజు రోజుకు రెట్టింపవుతున్నారు. బంగారం (gold)పై మనసు పారేసుకున్న వారు చాలామంది ఉన్నందున బంగారం ధరలు నిత్యం ఆకాశాన్ని అంటుతూనే ఉంటూ సామాన్యు లకు అందనంత దూరంలో పయని స్తుంటుంది. అయితే ఇదే క్రమంలో తాజాగా బంగారం ధరలు దూకుడు మీదున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో తులం బంగా రం ధర ఏకంగా రూ. లక్షకు చేరుతుందని వార్తలు గుప్పు మంటున్నాయి.

కాకపోతే బంగారం ధరలు (gold rates) ఇప్పట్లో ఆ స్థాయికి చేరుకు నేలా కనిపించడం లేదన్నది మార్కె ట్ (markets) వర్గాల నమ్మకం. మొన్నటి వరకు రూ. 80 వేల వరకు చేరుకున్న తు లం బంగారం ధర తాజాగా కాస్త తగ్గుముఖం పడుతూ రావడం గమనార్హం. ఈ క్రమం లోనే తాజా గా మంగళవారం కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మరి దేశ వ్యాప్తంగా మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పసిడి మార్కెట్ ను పరిశీలిద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో (delhi)22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,840కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,990 వద్ద కొనసాగు తోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో (mumbai)22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,840 వద్ద కొనసాగుతోంది.చెన్నైలో మంగళ వారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,240 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,4 40గా నమోదైంది.బెంగళూరు విష యానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,840 వద్ద కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,840 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,840గా ఉంది. అదే విధంగా విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 67,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,840గా ఉంది.

వెండి ధరలు ఇలా..
వెండి (silver)ధరల్లోనూ తగ్గుదల కనిపిం చింది. మంగళవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్‌క తా, ముంబయి పుణె వంటి నగ రాల్లో కిలో వెండి ధర రూ. 91,400 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్నం, విజయవాడలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 95,900 వద్ద కొనసాగుతోంది. మొత్తానికి పసిడి ధరలు పరుగులు పెడుతూ పసిడి ప్రియులను ఆందోళనకు గురిచేస్తుందని చెప్పవచ్చు.