–కొనసాగుతోన్న నిర్మల బడ్జెట్ ప్రసంగం
–ఎన్నికల మేనిఫెస్టోలో హామీ మేరకు బడ్జెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు
Union Budget 2024:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: వికసిత్ భారత్ (Developed India)ధ్యేయంగా పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం మంగళవారం యూనియన్ బడ్జెట్‌లో (Union Budget 2024)ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటించబోతోంది అని సామాన్య జనాలనుండి చదు వరుల, మదుపరుల వరకు అంద రూ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభలో దా దాపు 11 గంటలకు ప్రారంభమై న బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసా గుతోంది. మోదీ సర్కార్ ముచ్చ టగా 3వ సారి కొలువు తీరిన త ర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశం ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో కొన్ని కొన్ని కీలక ప్రకట నలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ని కల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి బడ్జెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా సంక్షేమానికి ప్రాధా న్యత ఇస్తూనే కొన్ని సెక్టార్‌లకు భారీ కేటాయింపులు చేయడం జరిగింది.
దేశానికి పల్లెలు పట్టు కొమ్మలు కాగా ఇందులో భాగంగానే మోడీ ప్రభుత్వం (modi govt) గ్రామీణాభివృద్ధికి రూ.2. 66 లక్షల కోట్లు కేటాయింపు చేయ డం శుభపరిణామం గా ఆయా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేథ్యం లో దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం అనేది ఎల్లపు డూ తోడుగా ఉంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖలు ఏర్పాటుకి శ్రీకారం చుట్టబోతున్నట్టు ప్రకటించారు. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రాల సర్వతోముఖా భివృద్ధి కి “పూర్వోదయ పథకం” అమలు చేయబోతున్నట్టు పేర్కొన్నారు.
ఈ విషయంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అన్ని విధాలా సా యం చేయబోతున్నట్టు ప్రకటించారు. మరీ ముఖ్యంగా గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు వేగవంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడింది. ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థులకు నేరుగా ఇ-వో చర్లను అందజేయడం ద్వారా మొ త్తం రుణంపై 3 శాతం వడ్డీ (intrest)రాయితీ కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం. అదేవి ధంగా అమృత్‌సర్ – కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పా టు కల్పించనున్నారు. రూ.26వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజె క్టులకు శ్రీకారం చుట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యో గుల క్షేమమే ధ్యేయంగా ఈపీఎఫ్‌ఓ (epfo) లో రిజిస్టర్ చేసుకున్న మొదటి సారి ఉద్యోగులకు 3 వాయిదాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద ఒక నెల జీతంలో రూ. 15,000 వరకు ఇవ్వ నున్నట్లు ప్రకటించారు.