Bommidi Nagesh:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటర్ వర్కర్స్ (Auto and Motor Workers)ఫెడరేషన్ ఐ.ఎఫ్.టీ.యూ అనుబంధం రాష్ట్ర 5వ మహాస భలు ఈనెల 21న భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా ఇల్లందు పట్టణ కేంద్రంలో జరిగాయి. ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి 250 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహాసభలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా నల్లగొండ పట్టణా నికి చెందిన ఇఫ్టూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ (Bommidi Nagesh) ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఈ ఎన్నిక పట్ల పట్టణ ఆటో యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బొమ్మిడి నగేష్ (Bommidi Nagesh)మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో మోటర్ రంగ కార్మికుల జీవితాలకు సమాజిక, జీవన భద్రత లేదని అన్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యో గాలు రాక జీవనోపాధి కోసం ప్రభుత్వం పై ఆధారపడకుండా ఆటో, లారీ, వ్యాన్, కారు, జీపు తదితర వాహనాలు నడుపుతూ జీవిస్తున్నామని అన్నారు. ఆర్. టి.ఏ,ట్రాఫిక్, ఫైనాన్స్ వేధింపులు కార్మికులపై ఎక్కువయ్యాయని, రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా యని దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో కుటుంబ పోషణ, పిల్లల చదువు లు, ఆరోగ్య సమస్యలు, ఇంటి కిరాయిలు శక్తికి మించిన భారంగా మారాయని అన్నారు.
ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం (State Govt) మోటర్ కార్మికు లకు ఇస్తానన్న 12 వేల రూపాయల ఆర్థిక సహాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన మోటర్ వాహన చట్టం ఎం.వి యాక్ట్, రోడ్ సేఫ్టీ బిల్లులను (MV Act, Road Safety Bills) కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ప్రత్యేకంగా మోటర్ కార్మికులకు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోవాలని కోరారు, ఇండ్లు లేని నిరుపేద కార్మికులను గుర్తించి ఇండ్లు ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ఫించన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్ ఆధ్వర్యంలో ముందుంటానని పేర్కొన్నారు. నాకు బాధ్యత అప్పగించిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ సంస్థ నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.