–లడ్డు తయారీలో ప్రక్షాళనకు టీటీడీ రంగం సిద్ధం
–నాణ్యతలేని నెయ్యి సరఫరా అవుతుందని గుర్తించిన టీటీడీ
–మొత్తంగా ముడి పదార్థాల సర ఫరాపై దృష్టి సారించిన ఈఓ
–పాత గుత్తేదారుల పై చర్యలతో పూర్తిగా పక్కకు పెట్టేoదుకు శ్రీకారం
TTD:ప్రజాదవెన, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు (Devotees of Tirumala Shri)అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు నాణ్యతపై టీటీడీ దృష్టి పెట్టింది. టిటిడికి సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత లేదని గుర్తించిన టిటిడి ఈ మేరకు చర్యలు చేపట్టింది. నెయ్యిలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలకు టిటిడి (ttd)సిద్దం అయ్యింది. తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యత అధ్వాన్నంగా ఉందని భక్తుల ఫిర్యాదులతో చర్యలు తీసుకుంటోంది. సమూల మార్పులు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఈవో శ్యామలరావు లడ్డు తయారీకి వినియోగించే ముడిసరుకులు నాణ్యతపై దృష్టి పెట్టారు. సరుకుల్లో నాణ్యత లేదని పోటు సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. నెయ్యి నాణ్యత అధ్వాన్నంగా ఉండటంతో లడ్డు నాణ్యత లోపిస్తోందని గుర్తించారు. ముడిసరుకుల నాణ్యతపై పరీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు తిరుమలలో ఎఫ్.ఎస్.ఎస్.ఐ (F.S.S.I)ద్వారా ప్రయోగశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని టిటిడి నిర్ణయించింది.
నాణ్యత లేని ముడిసరుకులు పంపిణీ చేసిన గుత్తేదారులపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేక పోవడాన్ని ఈవో (eo) గుర్తించారు. గుత్తేదారులపై చర్యలు లేకపోవడంతో ముడిసరుకుల నాణ్యత పడిపోయిందని భావిస్తున్న టిటిడి.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో నాణ్యత, రుచికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. నాణ్యతలేని నెయ్యి తో శ్రీవారికి లడ్డుప్రసాదం రుచి, నాణ్యత లేదన్న విషయాన్ని టిటిడి గుర్తించింది. నెయ్యిలో నాణ్యత లేకపోవడంపై టీటీడీ(ttd) సీరియస్‌గా పరిగణిస్తోంది. సరఫరాదారులకు టీటీడీ ఈ మేరకు హెచ్చరించింది. నెయ్యి సేకరణ నిపుణుల కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఈవో శ్యామల రావు తనిఖీ కోసం నెయ్యి శాంపిల్స్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు పంపారు. టిటిడికి నెయ్యి సరఫరా చేస్తున్న 5 మంది సరఫరాదారుల్లో ఒకరు సప్లై చేసిన నెయ్యి నాణ్యత లేదని గుర్తించారు.
కల్తీ నెయ్యిని (adulterated ghee)సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు గుర్తించిన టిటిడి టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సప్లయిర్‌ను బ్లాక్ లిస్ట్ చేర్చేందుకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. నెయ్యి సప్లైలో నిబంధనలు పాటించక పోతే చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఏడాదికి 5000 మెట్రిక్ టన్నుల నెయ్యిని కొనుగోలు చూస్తున్నట్లు టీటీడీ తెలిపింది. కొత్తగా సప్లై చేస్తున్న తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ (AR Diary)నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. కేజీ నెయ్యి ధర రూ. 351 నుంచి రూ.411 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.