Fire Officer:ప్రజా దీవెన, నల్లగొండ:నల్గొండ మండలం అప్పాజీపేట కి చెందిన అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ (Fire Officer) ఆఫీసర్ కేతారపు రాజు (36), షాద్ నగర్ నుండి బదిలీ పై (tranfser) నల్లగొండకు వచ్చారు. నల్గొండ ఫైర్ ఆఫీసులో రిపోర్ట్ చేసి మద్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తన ఇల్లు కథాలగూడ గ్రీన్ సిటీ కాలనీ లో తన ఇంటికి వెల్లి గడ్డి మందు తాగాడని, దీంతో ఆయనను ఐ కాన్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స జరుపుతుండగా మంగళవారం 23వ తేదీన చనిపోయాడని తెలిపారు. వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అతని తండ్రి కేతారపు కృష్ణయ్య (Ketarapu Krishnaiah) పిర్యాదు లో గత కొంత కాలంగా తన కొడుకుకి, కోడలు కి కుటుంబ పరమైన విషయాలలో గొడవలు జరుగుతున్నాయని, కుటుంబ కలహాల కారణంగా జీవితం పై విరక్తి చెంది గడ్డి మందు తాగి చనిపోయినాడని తెలిపారు. అతని తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు (Registration of case)చేయడం జరిగిందని అన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.