Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Plane Clash: నేపాల్ లో కుప్పకూలిన విమానం

–19 మంది ప్రయాణికుల దుర్మర ణం

Plane Clash:ప్రజా దీవెన,నేపాల్: నేపాల్ (Nepal) దేశం ఖాట్మండు విమానాశ్రయంలో (Kathmandu Airport)రన్‌వే నుంచి జారిపడి విమానం కుప్ప కూలిన సంఘటనలో19 మంది దుర్మరణం పాలయ్యారు. రన్బీపై నుంచి టేక్ ఆఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో ఈ విమానం (plane) కూలిపోయిందని రాష్ట్ర టెలివిజన్ (State Television) తెలిపింది. రాయిటర్స్ ప్రకారం క్రాష్ తర్వాత 18 మృతదే హాలను వెలికితీశారు. H విమానం, పోఖారాకు మార్గమధ్యంలో ఎయిర్‌ క్రూతో సహా పంతొమ్మిది మందితో ఉండగా ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం పైలట్‌ను ఆసుపత్రికి తరలించినట్లు విమానాశ్రయంలో మోహరించిన భద్రతా అధికారి తదుపరి వివరాలు చెప్పకుండా పిటిఐకి తెలిపారు. విమానం నుంచి చెలరేగిన మంటలను ఆర్పివేశా మని ఆయన తెలిపారు. ప్రమాద స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడు తున్నారు. ప్రయాణికుల పరిస్థితి వివరాలు తెలియరాలేదు.

గత ఏడాది జనవరిలో నేపాల్‌లోని (nepal)పోఖారా సమీపంలో ఏటీ ఎయిర్‌లై న్స్ విమానం (AT Airlines flight)కూలిపోవడంతో అందులో ఉన్న 72 మంది మరణిం చిన విషయం తెలిసిందే. విమానం నిటారుగా ఉన్న లోయలోకి దూసుకెళ్లి మంటలు చెలరేగడానికి ముందు ముక్కలుగా విరిగిపో యింది. పైలట్ (pilot)తప్పిదం వల్లే ప్రమా దం జరిగి ఉంటుందని ప్రభుత్వం చేసిన దర్యాప్తు నివేదికలో ప్రాథమికంగా తేలింది.