–ప్లేట్లు, గ్లాసులు పెట్టెలు, బట్టలు, చెప్పులు వెంటనే పంపిణీ చేయాలి
–కుల వివక్ష వ్యతిరేక పోరాట సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
Paladugu Nagarjuna:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ విద్యార్థినీ విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించకపోవడం అన్యాయమని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం (Failure of State Govt) స్పష్టంగా కనబడుతుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున (Paladugu Nagarjuna) అన్నారు. కెవిపిఎస్ ఆధ్వర్యంలో సంక్షేమ హస్టల్ అధ్యయన కార్యక్రమం నల్లగొండ ఎస్సీ బాలుర హాస్టల్లో సమగ్ర సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాగా ర్జున మాట్లాడుతూ విద్యా సంవత్స రం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ విద్యార్థిని విద్యార్థుల కు పెట్టెలు, బట్టలు, చెప్పులు, దుప్పట్లు, ప్లేటు, గ్లాసులు (Boxes, clothes, slippers, blankets, plate, glasses) నేటికీ అందించక పోవడం అన్యాయం అన్నారు. వెంటనే పంపిణీ చేయా లని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టలలో సమస్యలు తీష్ట వేశా యని తెలిపారు. మెనూ ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదని, కనీస నాణ్యత పాటించడం లేదని, విద్యార్థులు ఒక్కరు కడుపునిండా తినే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ హాస్టల్స్ లో వంట మనుషులకు శిక్షణ (training)ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా అధికారులు వెం టనే దీనిపై దృష్టి సారించాలని కోరా రు. ఈ అధ్యయన యాత్రలో కుల వ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గాదే నరసింహ, బొల్లు రవీందర్, బొట్టు శివకుమార్ తదితరులు పాల్గొన్నా రు.