–పోలీసులు దాడుల్లో వెలుగులోకి వచ్చిన మోసాలు
Fraud Alert:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ (Prakasam Bazar) లోని పలు వ్యాపార దుకా ణాల్లో వ్యాపారుల ఘరానా మోసం బట్టబయలైంది. పలు దుకాణాలపై కాపీ రైట్స్ అధికారుల తనిఖీల్లో అనేక ఆశ్చర్య కరమైన విషయాలు వెలుగు చూశాయి. హనుమాన్ ఎలక్ట్రిక్ షాప్ లో గోల్డ్ మెడల్ కంపెనీ (Gold Medal Company in Hanuman Electric Shop)పేరు చెప్పి నాణ్యతలేని వైర్లను అమ్ముతున్న వైనం బయట పడింది. దాడుల్లో రూ.22 లక్షల విలువ గల 16 వైర్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే విధంగా పద్మావతి కిరాణం షాపులో రూ 1.70 లక్షల విలువ గల కల్తీ మస్కిటో అగరబ త్తులు స్వాధీనం చేసుకున్నారు.
పలు దుకాణాలపై ఇంకా దాడులు (attacks)కొనసాగుతున్నాయి.