Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nirmala Sitharaman:రాజ్యసభలో రాజుకున్న వివాదాలు

— బడ్జెట్ పై విపక్షాల విమర్శలు, అధికారపక్షం ప్రతి విమర్శలు
–ప్ర‌సంగంలో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్ప‌లేమని, అన్ని రాష్ట్రాల‌కు కేటాయింపులున్నాయన్న నిర్మ‌ల
–వెన‌క్కి త‌గ్గ‌ని విప‌క్షం స‌భ నుంచి వాకౌట్ , పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న‌లు

Nirmala Sitharaman:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రవేశపెట్టిన బడ్జెట్ పెద్దల సబైన రాజ్యసభలో రాద్ధాంతాన్ని రాజేసింది. విమర్శలు ప్రతి విమర్శ లతో అట్టుడికిపోయింది. ఆర్థికమం త్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండి యా కూటమి ధ్వజమెత్తింది. ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి వ్యతిరే కంగా పార్లమెంటు లోపలా, వెలుప లా నేడు నిరసన వ్యక్తంచేసింది. అయితే, ఈ ఆరోపణలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీటుగా స్పందించారు. బుధవారం రాజ్యస భలో (Rajya Sabha) ప్రసంగించిన ఆమె బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమంటూ విపక్షాలను దు య్యబట్టారు.కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బడ్జెట్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించే అవకాశం రాదు. మహారాష్ట్రలోని వందవన్‌లో పోర్ట్‌ ను ఏర్పాటుచేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కానీ, నిన్నటి బడ్జెట్‌లో మహారాష్ట్ర పేరును చెప్పలేదు. అలాగని.. తమను విస్మరించారని ఆ రాష్ట్రం భావిస్తోం దా బడ్జెట్‌ ప్రసంగంలో ఓ రాష్ట్రం పేరును ప్రస్తావించనంత మాత్రాన.. కేంద్రం నుంచి వారికి నిధులు వెళ్లవా? విపక్షాలది దారుణమైన ఆరోపణ. తమ రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కుట్రలు చేస్తున్నాయి” అని నిర్మల ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా ఆమె సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశాయి. ఈసం దర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ”బడ్జెట్‌లో రాష్ట్రాల మధ్య సమతు ల్యత లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది దీన్ని మేం తీవ్రం గా ఖండిస్తున్నామని, దీనిపై నిరస న తెలియజేస్తామని అన్నారు.

ఎన్డీఎ (nda)మిత్ర ప‌క్షాల‌కే మ‌ద్ద‌తు ధ‌ర ఇక, సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి నేతలు బడ్జెట్‌ కు వ్యతిరేకంగా ఆందోళన చేప ట్టారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షు డు, ఎంపీ అఖిలేశ్ యాదవ్‌ మాట్లాడుతూ.. ”రైతులకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధత కల్పించాలని ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్నాం. కానీ, ఈ బడ్జెట్‌లో కేంద్రం తమ మిత్రపక్షాలకు మాత్రమే ‘మద్దతు ధర’ ఇచ్చింది” అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.