తెలంగాణ సాహిత్యానికి వారిద్దరు రెండు కళ్ళు
— ఎంజీ యూనివర్సిటీ లో దాశరధి, సినారె జయంతి స్మారక ఉపన్యాసం కార్యక్రమం
ప్రజా దీవెన/ నల్లగొండ: తెలంగాణ సాహిత్యానికి దాశరధి, డాక్టర్ సి.నారాయణరెడ్డి ఇద్దరు సూర్యచంద్రులని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య సూర్య ధనంజయ, ఆచార్య సాగి కమలాకర్ శర్మలు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో దాశరధి కృష్ణమాచార్య, సి.నారాయణరెడ్డి ల జయంతి స్మారక ఉపన్యాస కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానవక్తలైన వారు సి నారాయణ రెడ్డి గీతం సాహిత్యం అనే అంశంపై మాట్లాడుతూ తెలుగుదనానికి నిలువెత్తు సంతకం సినారే అని కొనియాడారు.
సినారే గారి విశ్వంభరా నాగార్జునసాగర్ జనాలపై వారు విస్తృతంగా ప్రసంగించారు. దాశరథి జీవితం సాహిత్యం అనే అంశంపై ప్రసంగించారు. శ్రమజీవుల బడుగు వర్గాల పక్షంలో నిలబడి స్వాతంత్ర పోరాటం చేశాడు జైలుకు పోయి కఠిన శిక్షను అనుభవించాడని, నిజాం నవాబును ఎదిరించిన విప్లవ కవి దాశరథి అతనిది కేవలం కుర్చీలో కూర్చొని బల్లల మీద కాగితంపై రాసే కవిత్వం కాదు, విప్లవజాలలో కాలిన కఠిన శిక్షణ నుంచి వచ్చిన కవిత్వమని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య సిహెచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ దాశరధి కృష్ణమాచార్య మరియు శ్రీరామనారాయణరెడ్డి ల పాటలు తమ చిన్నప్పటి నుంచి శ్రోతలను ఎంతగానో ఆకర్షించాయని అన్నారు. వారి బాటలో ఎన్నో సాహిత్య విలువలు ఉన్నాయని కొనియాడారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో జిఆర్ఎఫ్ సాధించిన బ్యాచ్ విద్యార్థి రవికిరణ్ ను జారఫ్ నెట్టు సెట్టు సాధించిన వేముల శేఖర్ ను నెట్టు సాధించిన అనిల్ కుమార్ ను ఉపకులపతి గోపాల్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
చదువులో ముందుండే వారికి విశ్వవిద్యాలయం అన్ని విధాలుగా సహకరిస్తుందని వారు విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అరుణ ప్రియ, ఓ ఎస్ డి వి సి అల్వాల రవి, ఆడి సెల్ డైరెక్టర్ అంజి రెడ్డి, తెలుగు శాఖ అధ్యాపకులు ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.