–ఏపీలో 45 రోజుల్లో 35 రాజకీయ హత్యలు
–వెనువెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి
–ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా లో మాజీ సిఎం జగన్
Jagan:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజా స్వామ్యం (Andhra Pradesh is public domain)అంతం అవుతోంద ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (jagan mohan reddy) ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించా లని డిమాండ్ చేశారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లో నే 35 రాజకీయ హత్యలు జరిగా యని ఆరోపించారు.
తమ పార్టీ కార్యకర్తల వందల ఇళ్లను ధ్వంసం చేశారని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారని, వెయ్యికి పైగా అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. గిట్టని వారి పంటలను కూడా నాశ నం చేశారని తెలిపారు. తమ హ యాంలో ఏనాడూ ఇలాoటి దాడు లు, దౌర్జన్యాల్ని ప్రొత్స హించలేదని జగన్ (jagan)చెప్పుకొన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ లోకేశ్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లు (Hoardings) పెట్టారని, తనకు నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యల కు దిగుతున్నారని జగన్ మండి పడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని, మీడియా, ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వా మ్య పరిరక్షణకు సహరించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమిలోకి వచ్చేందుకు జగన్ కు ఇదే సరైన సమయమని విదుత లాయ్ చిరుతైగళ్ కట్చి (వీసీకే) అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్ సూచించారు. వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ మినహా ఇండియా కూటమి పక్షాల నేతలు ఎస్పీ అధి నేత అఖిలేశ్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్, ఉద్దవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వే ది, సంజయౌత్, అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, సమాజ్వాదీ పార్టీ ఎంపీరామ్ గోపాల్ యాదవ్ (Gopal Yadav) సంఘీ భావం తెలిపారు.