Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Draupadi Murmu:ఉపాధ్యాయురాలిగా రాష్ట్రపతి

–తొమ్మిదో క్లాస్ విద్యార్ధుల‌కు పాఠాలు చెప్పిన ప్రెసిడెంటు
–అమ్మ పేరుతో మొక్క‌లు నాటాల‌ ని పిలుపు

Draupadi Murmu:ప్రజా దీవెన, న్యూఢిల్లీ : దేశ ప్రథమ పౌరురాలిగా, రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu)బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని ఆమె (Draupadi Murmu)మరింత ప్రత్యే కంగా మార్చుకున్నారు. తనకెంతో ఇష్టమైన వృత్తి అయిన ఉపాధ్యా యురాలిగా మారారు. ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లోని డా.రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు (To Kendriya Vidyalaya School)వెళ్లి విద్యార్థులను ఆశ్చర్యపర్చారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు.తొలుత విద్యార్థుల పేర్లు అడిగి వారితో ముచ్చటించారు. వారి అభిరుచు లు, లక్ష్యాలు తెలుసుకున్నారు. ఈ తరం విద్యార్థులు ఎంతో ప్రతిభా వంతులని, సాంకేతికంగా వీరికి పుష్క లమైన అవకాశాలు ఉన్నా యని ముర్ము అన్నారు.

అనంతరం ‘గ్లోబల్‌ వార్మింగ్‌’పై (‘Global Warming’)వారికి బోధించా రు. భావితరాల కోసం పర్యావరణా న్ని కాపాడుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. నీటి సంరక్షణ ప్రా ముఖ్యాన్ని వివరించారు. పర్యావర ణ మార్పు ప్రభావం మనపై పడ కుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కు వ మొక్కలు నాటాలని విద్యా ర్థుల ను ప్రోత్సహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్ అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి, గురించి ప్రస్తావించారు. ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క (plant)నాటాలని ఆకాంక్షించారు.