–మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు
–కాల్పుల్లో దళ సభ్యుడు ఆశోక్ మృతి
Counter Fire: ప్రజా దీవెన, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరంగల్ జిల్లా సరిహద్దు (border)జిల్లాలోని మావోయి స్టుల కు పోలీసులకు కాల్పులు జరిగి నట్లు ఈ కాల్పుల ఘటనలో దళ సభ్యుడు ఆశోక్ (Ashok) అనే మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కొన్ని సంవత్సరాల తర్వాత, గుండాల అడవుల్లో తుపాకులు మోత మోగడంతో ఏజెన్సీ గ్రామాల, ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు.ఈ కాల్పుల ఘటనలో (A shooting incident)మావోయిస్టులు ఎంతమంది ఉన్నారని, పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. గుండాల మండలం దామరతోగు గ్రామంలో ఈ కాల్పులు జరగడంతో, పినపాక, గుండాల, మణుగూరు, పోలీసుల తో పాటు, ములుగు జిల్లాలోని మంగపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, పోలీసులు అప్రమత్త మయ్యారు. ఎంతమంది మావోయి స్టులు ఈ కాల్పుల్లో పాల్గొన్నారనేది పోలీసులు అంచనా వేస్తున్నారు. కాల్పులు (firing) జరిగిన ప్రాంతంలో మావో యిస్టులు ఎంతమంది ఉన్నారని, అడవులను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు-కూంబింగ్ పోలీసు లకు మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘట నపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.