Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Blood Donation: అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది: సురేష్

Blood Donation: ప్రజా దీవెన, కోదాడ: అన్ని దానాల కన్నా రక్తదానం (blood donation) గొప్పదని మాతంగి భాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మాతంగి సురేష్ (suresh) అన్నారు. నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని పున్నమ్మ.కోదాడ తిరుమల హాస్పిటల్ (Kodada Tirumala Hospital)లో అత్యవసర ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో గురువారం ఎంబిఎం గ్రూప్ సభ్యుడు కోదాడ మున్సిపల్ పరిధిలోని కొమరబండ కు చెందిన యువశక్తి యువజన సంఘం అధ్యక్షులు మంద నాగేంద్రబాబు పున్నమ్మకు రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు.ఈ సందర్భంగా, సురేష్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురి అయిన వారికి హాస్పటల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎంతోమందికి రక్తాన్ని అందించి ప్రాణదాతగా నిలుస్తున్నా మని తెలిపారు.రాబోయే రోజులలో ఈ ట్రస్టు ద్వారా సూర్యాపేట జిల్లా తో పాటు ఖమ్మం , ఎన్టీఆర్ జిల్లా,(Khammam, NTR District) జిల్లాలలోఎంతోమందికి రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు ఇందుకు సహకరిస్తున్న గ్రూపు సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు .మంద నాగేంద్రబాబు ఇప్పటివరకు ఎంబీఏం ట్రస్టు ద్వారా 07 సార్లు రక్తదానం చేసి విలువైన ప్రాణాలు కాపాడారని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ,మొలుగూరి సైదులు,ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు