Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sridhar Babu: తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు

–వెమ్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌ బాబు
–నిమ్జ్‌లో రక్షణ పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న ‘వెమ్‌ టెక్నాలజీస్‌’

Sridhar Babu:ప్రజా దీవెన, హైదరాబాద్‌: రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి సంస్థ ‘వెమ్‌ టెక్నాలజీస్‌’ (Wem Technologies) రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆ సంస్థ సీఎండీ వి.వెంకటరాజు, ప్రతి నిధులు గురువారం సచివాల యంలో ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో (Sridhar Babu) సమా వేశమయ్యారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ జహీ రాబాద్‌ నిమ్జ్‌లో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ మొదటి దశలో రూ.10 00 కోట్ల పెట్టుబడులు పెడుతోం దన్నారు. ఇదివచ్చే ఏడాది డిసెం బరు నాటికి పూర్తవుతుందని, తొలి దశలో వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉద్యో గాలు లభిస్తాయని చెప్పారు. పరిశ్రమకు కావాల్సిన భూమిని వెంటనే సమీకరించి ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతికి శ్రీధర్‌బాబు (Sridhar Babu) సూచించారు.

ఉత్పత్తి ప్రారంభించడానికి అవ సరమైన 33 కేవీ విద్యుత్తు లైన్లను 4 నెలల్లో ఏర్పాటు చేసి సరఫరా ప్రారంభించాలని ట్రాన్స్‌కో అధి కారులను ఆదేశించారు. సమా వేశంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువ ర్ధన్‌రెడ్డి, సీఈవో మధుసూదన్‌, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ జగత్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు. అలాగే, జపనీస్‌ పెట్రో కెమికల్‌ (Japanese Petrochemical)దిగ్గజం ‘మిత్సుయి కెమికల్స్‌’ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి టెక్నికల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. సంస్థ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఫ్యూజి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గురువారం మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయింది. టీహబ్‌ ద్వారా లైఫ్‌సైన్సెస్‌, పెట్రో కెమికల్స్‌ రంగాల్లోని అంకుర సంస్థల్లో 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధి హన్మంతరావు తెలిపారు.

ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి తే సహించం ప్రభుత్వరంగ సంస్థల(Government organizations)వాటాల విక్రయం ద్వారా ఈ ఏడాది రూ.50 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ప్రస్తావిం చడం పై మంత్రి శ్రీధర్‌బాబు స్పం దించా రు. ఇది కన్నబిడ్డలను మరొకరికి అమ్ముకోవడం లాంటి దారుణ మన్నారు. 13 మహారత్న, 14 నవరత్న, 72 మినీరత్న సంస్థలన్నీ లా భాల్లో ఉన్నాయని వాటిని అమ్మితే కాంగ్రెస్‌ చూస్తూ ఊరు కోదని హెచ్చరించారు.