— తెరుచుకోనున్న నిజాం షుగర్స్
–బోధన్, మెట్పల్లి, మెదక్ ఫ్యాక్ట రీల పునరుద్ధరణకు రూ.132 కోట్లు
Sugar Factory:ప్రజా దీవెన, హైదరాబాద్: పరిశ్ర మల శాఖకు ఈ సారి బడ్జెట్టులో (budget)నిరుటితో పోలిస్తే తక్కువ కేటా యింపులు దక్కాయి. నిరుడు రూ. 4037కోట్లు కేటాయించగా, ఈసారి రూ.2762కోట్లు కేటాయించారు. ఈ సారి పారిశ్రామిక రాయితీలు ఇచ్చే అవసరం పెద్దగా లేకపోవడంతో కేటాయిం పులు తగ్గాయి. గతంతో పోలిస్తే రూ.1275కోట్లు తగ్గాయి. ఈసారి కొత్త పథకాలకు అధిక ని ధులు కేటాయించారు. ఎన్నికల మేనిఫెస్టోలో (Election Manifesto) ప్రకటించినట్లుగా ని జాం చక్కెర కర్మాగారాల పునరు ద్ధరణకు కాంగ్రెస్ సర్కారు రూ. 138 కోట్లు కేటాయించింది. బోధన్, మెట్ పల్లి, మెదక్లో (Bodhan, Metpalli, Medak) ఉన్న ఈ ఫ్యాక్టరీలు డిసెంబరు–2015లో మూతప డ్డాయి.
వీటిలో తొలుత మెట్పల్లి ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక స్కిల్ యూనివర్సిటీ కోసం రూ.75కోట్లు, చేనేత కార్మికుల సంక్షేమానికి 355కోట్లు కేటాయించారు. పరిశ్రమల విద్యుత్తు రాయితీకి (Industrial Power Subsidy) రూ.250కోట్లు, పావలా వడ్డీకి రూ.250కోట్లు, ఇతర రాయితీలు, నిమ్జ్ భూసేకరణకు రూ.125కోట్లు, ముచ్చెర్ల ఫార్మాసిటీ స్థానంలో కొత్తగా ప్రకటించిన ఔషధ గ్రామాల్లో భూసేకరణ కోసం రూ.50కోట్లు, ఇతర రాయితీలకు మొత్తం రూ.986కోట్లు కేటాయించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి (Information Technology)నిరుడు రూ.366కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.774కోట్లకు పెంచారు.