–అసెంబ్లీలో చంద్రబాబు సూచనతో నిలబడ్డ మెజార్టీ ఎమ్మెల్యేలు
— పవన్, లోకేశ్ తదితర మంత్రు లూ సైతం
Chandrababu: ప్రజా దీవెన, అమరావతి: ఆంద్రప్రదేశ్ లో గత ఏడేళ్ల జగన్ ప్ర భుత్వ బాధితుల్లో సామాన్యులే కా దు ఎంతో మంది ఎమ్మెల్యేలు కూ డా ఉన్నారని సాక్షాత్తూ ఏపి ముఖ్య మంత్రి చంద్రబాబు (Chandrababu), ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ (pawan kalyan), స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేశ్ (nara lokesh) ఇంకా చాలా మంది ఈ జాబి తాలో ఉన్నారు. గత ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లో తా మూ బాధితులమేనంటూ ము ఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)సూచన మేరకు అసెంబ్లీలో పవన్, లోకేశ్, పలువురు మంత్రులతో సహా 90 శాతం మంది ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు.
అసెంబ్లీ సమావేశాల్లో (In assembly meetings) గురువారం ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై చంద్రబాబు(Chandrababu) శ్వేత పత్రం విడుదల చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తి గా అదుపు తప్పాయంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా రు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ బాధి తుల్లో తాను, పవన్, స్పీకర్, అచ్చె న్న, నారాయణ, లోకేశ్, ఇతర మం త్రులు ఉన్నారంటూ పేర్లు ప్రస్తావి స్తూ సభ్యుల వైపు చూశారు. ఈ సందర్భంగా బాధిత ఎమ్మెల్యేలు (mlas) చేతులెత్తారు. దీంతో చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో శారీరక, మాన సిక, ఆర్థిక పరమైన వేధింపులకు గురై అక్రమ కేసుల్లో చిక్కుకున్న బాధితులు ఒకసారి లేచి నిల్చోం డని అని అన్నారు. దీంతో పవన్, లోకేశ్, మంత్రులతో సహా దాదాపు 90 శాతం మంది ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు చేసిన పని సభలో నవ్వులు పూయించింది.