Waiver of ‘loan’ to the breadwinner అన్నదాతకు ‘ రుణ ‘ మాఫీ
-- రూ.90 వేల లోపు రైతుల పంట రుణాల మాఫీ -- రైతులకిచ్చిన హామీల అమలుకు అడుగులు -- అధికారికంగా ప్రకటించిన ఆర్ధిక మంత్రి హరీష్ రావు
అన్నదాతకు ‘ రుణ ‘ మాఫీ
— రూ.90 వేల లోపు రైతుల పంట రుణాల మాఫీ
— రైతులకిచ్చిన హామీల అమలుకు అడుగులు
— అధికారికంగా ప్రకటించిన ఆర్ధిక మంత్రి హరీష్ రావు
ప్రజా దీవెన /హైదరాబాద్: తెలంగాణ అన్నదాతలకు కెసిఆర్ ప్రభుత్వం రుణమాఫీ ( Waiver of ‘loan’ to the breadwinner ) అమలు చేయనుంది. దీంతో యావత్ తెలంగాణ రైతులకు తీపి కబురు అందినట్లయిoది. రాబోయే సార్వత్రిక ఎన్నికల వేళ బిఆర్ఎస్ ప్రభుత్వం (brs government) ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండడంతో అన్నదాతల్లో ఆనందోత్సవాలు ( Anandatsavali among the breadwinners) వెల్లి విరుస్తున్నాయి. ప్రస్తుత ఏడాదికి సంబంధించి రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు(harish Rao)అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా 37 వేల నుంచి 90 వేల లోపు రుణాలకు సంబంధించి బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయింపు ద్వారా గత ఏడాది కన్నా రూ. 2,385 కోట్లు అధికం కావడం విశేషం. రైతుల కంటిలో కన్నీరు రాకుండా చూస్తానన్న సీఎం కేసీఆర్ రైతులకిచ్చిన మరో ఎన్నికల హామీని నెరవేర్చే క్రమoలో ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన రుణమాఫీ కోసం బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గత బడ్జెట్‌లో రైతు రుణమాఫీ కోసం రూ.4,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.2,385 కోట్లు అధికంగా కేటాయించిందని,ఈ నిధులతో రూ.37 వేల నుంచి రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేయనున్నదని పేర్కొన్నారు.