Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Coconut water: కొబ్బరినీళ్ల వాళ్ళ కలిగే లాభాలు ఇవే

Coconut water:నిజానికి కొబ్బరి నీళ్లు Coconut water) అంటె చాల మందికి ఇష్టం . ఇక వాటిని తాగడానికి ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు అనే చెప్పాలి. ఈ క్రమ్మలో తరచుగా చాలా మంది తాగుతూనే ఉంటారు.. ఇక ఎవరైనా సరే అనారోగ్యం బారిన పడినా, డీహైడ్రేషన్ (Dehydration) కు గురైనా కొబ్బరినీళ్లు తాగమని కూడా డాక్టర్లు (docters)చెప్తూ ఉంటారు. ఇంకా చాలా మంది సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి సముద్ర తీరానికి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఈ సహజ పానీయాన్ని తాగుతారు. ఈ శక్తివంతమైన పానీయం తాగడం వల్ల మన శరీరంలో నీటి కొరత ఏర్పడదు.. ఇది డీహైడ్రేషన్‌ను (Dehydration) కూడా సులువుగా తగ్గిస్తుంది. అందుకే.. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కొబ్బరి నీళ్లుకు మంచి డిమాండ్‌ ఉంది.

వాస్తవానికి కొబ్బరి నీళ్లను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిందని డాక్టర్లు (docters) తెలుపుతున్నారు.. ఇది మన దాహాన్ని తీర్చడమే కాకుండా అనేక వ్యాధుల నుండి బయట పడేందుకు సహాయ పడుతుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఏయే వ్యాధులు, సమస్యలు నయమవుతాయో చూడండి…

1 వాస్తవాయినికి ఊబకాయం (obesity)అనేది ఒక వ్యాధి కాదు.. కానీ ఇది అనేక వ్యాధులకు కారణం అవుతుంది .. కనుక బరువు తగ్గడానికి, పొట్ట కొవ్వును తగ్గించడానికి, కొబ్బరి నీటిని మీ అలవాటులో భాగం చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల కొన్ని నెలల్లోనే మీ శరీరం బాగా ఉంటుంది.

2 ఇక అధిక రక్తపోటుతో (high blood pressure) బాధపడేవారు రోజూ కొబ్బరినీళ్లు తరుచుగా తాగాలి. ఎందుకంటే కొబ్బరినీళ్లు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఆపై కొవ్వు తగ్గడం వల్ల, బిపి క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. అందుకు ఈ సహజ పానీయం ప్రయోజనకరంగా వాడుతారు.

3 భారతదేశంలో గుండె జబ్బులతో (Heart disease)బాధపడేవారికి కొరత లేదు.. అందుకే మనమందరం కొబ్బరి నీళ్ళు తాగాలి. ఇది గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి ప్రమాదాన్ని చాలా వరకు నయం చేస్తుంది.

4 అలాగే కరోనా కాలం తర్వాత, ఇన్‌ఫెక్షన్‌ను (infection నివారించడం గురించి మనం చాలా స్పృహతో ఉన్నాం.. దీని గురించి అవగాహన కూడా పెరిగింది.. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం కొబ్బరినీళ్లు తాగితే రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఇన్ఫెక్షన్లు, అనేక వ్యాధుల భారీన పడకుండా ఉన్నాం.