–తాజాగా ఒబామా దంపతుకూ డగట్టిన కమల
–ఒక్క జూమ్ కాల్‌తో హారిస్‌కు రూ.16.74 కోట్ల విరాళాలు
–జూమ్ చరిత్రలోనే అతిపెద్ద గ్రూప్ కాల్‌గా రికార్డు
Kamala Harris:ప్రజా దీవెన, వాషింగ్టన్, జూలై 26: కమలా హ్యారిస్ (Kamala Harris) అధ్యక్ష అభ్యర్థిత్వా న్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన సతీమణి మిషెల్ ఒబామా (Wife Michelle Obama)సమర్థించారు. దీనిపై వారు శుక్రవారం కమలకు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. మీకు మద్దతు ఇవ్వడానికి మేం ఎంతగా నో గర్విస్తున్నామని, ఈ ఎన్నికల్లో మీరు గెలవడానికి చేయాల్సిందం తా చేస్తామని కమలకు బరాక్ హామీ ఇచ్చారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నామని, ఇది చరిత్రా త్మకం కాబోతోందoటూ మిషెల్ కూడా తన మద్దతు ప్రకటించారు.
అందుకు హ్యారిస్ (Kamala Harris) వారిద్దరికీ కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కాల్‌కు సంబం ధించి దాదాపు ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోను మిషెల్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కమ లను డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష (President of the Democratic Party) అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిం చిన తర్వాత ఆమె తరఫున ప్రచార కార్యక్రమాల్లో కూడా బరాక్ ఒబా మా పాల్గొనే అవకాశం ఉంది. మరో వైపు, కమలా హ్యారిస్‌కు డెమోక్రాటి క్ పార్టీ సభ్యులతో పాటు దాతలు, రాజకీయ నాయకుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పుడు పార్టీ లో కీలక నేత ఒబామా మద్దతు సైతం లభించడం నిధుల సమీకరణ కు దోహదపడనుంది. ఇదిలా ఉండ గా, అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వా న్ని సాధించే దిశగా కమలా హారిస్ దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం ఆమె ఎన్నికల ప్రచారం (Election campaign)జోరుగా సాగుతోంది. గురువారం రాత్రి కమల కోసం నిర్వహించిన ఓ జూమ్ కాల్‌లో ఏకంగా 1,64,000 మంది మహిళలు పాల్గొని, విరాళా లతో హోరెత్తించారు. 90 నిమిషాల పాటు సాగిన ఈ జూమ్ కాల్‌లో ఏకంగా రూ.16.74 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ‘వైట్ ఉమన్: ఆన్సర్ ద కాల్’ పేరిట కమలకు మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమం జూమ్ చరిత్రలోనే అతిపెద్ద గ్రూప్ కాల్‌గా రికార్డు సృష్టించింది. జూమ్ మీటింగ్ (Zoom meeting)ప్రారంభం కాగానే విపరీతమైన స్పందన వచ్చింది. సభ్యుల సంఖ్య పెరుగుతూ పోవడంతో కొద్దిసేపు సర్వర్ క్రాష్ అయింది. కాగా, కమలకు పిల్లలు లేరంటూ జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆమె సవతి కుమార్తె ఎల్లా ఎంహాఫ్ తాజాగా స్పందించారు. మేమంతా ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారని నిలదీశారు.