Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: సిద్ధమా… సిద్ధం..!

–నువ్వా నేనా అన్నంత పని చేసిన రేవంత్, హరిష్
–సవాల్, ప్రతిసవాల్ లతో అట్టుడి కిన అసెంబ్లీ
–కౌంట‌ర్,ఎన్ కౌంట‌ర్ల‌తో వేడి సెగ‌లు
–అప్పులు కేవలం నాలుగు ల‌క్ష‌ల కోట్లే తెలంగాణ‌కు స్థిరాస్థి ఇచ్చాం అన్న హ‌రీశ్
–అప్పులు స‌రే..ఓఆర్ఆర్ ను ఎందుక‌మ్మారన్న సీఎం రేవంత్
–అమ్మ‌లా, లీజ్ కు ఇచ్చాం, చెక్ చేసుకోండి అంటూ కౌంట‌ర్
–బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ విచార‌ణ‌కు సిద్ద‌మా అంటూ రేవంత్ ప్ర‌శ్న‌
–సంసిద్ధం అంటూ హ‌రీశ్ దీటైన సమాచారo

Harish Rao:ప్రజా దీవెన, హైద‌రాబాద్: అప్పుల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిప డ్డారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సాగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లా డుతూ కాంగ్రెస్ నేతలు పదేపదే కేసీఆర్ హయంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని అవా స్తవాలు చెబుతున్నారని మండి పడ్డారు.2014లో తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి వారసత్వంగా రూ.72 వేల కోట్ల అప్పులు వచ్చాయని తెలిపారు. ఈ రూ.7 లక్షల కోట్ల అప్పులలో కొన్ని చెల్లించినవి కొన్ని చెల్లించనివి ఉన్నాయన్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే తాము చేసిన అప్పు రూ.4 లక్షల కోట్లకు పైగా మాత్రమే ఉంటుందన్నారు.

అయినా, తాము చేసిన అప్పుల గురించి చెబుతున్న కాంగ్రెస్ నేతలు (Congress leaders)తాము కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు, దేవాదుల, సమ్మక్క బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజె క్టు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్, సుందిళ్ల భక్తరామదాసు ప్రాజెక్టు…(Sammakka Barrage, Kaleswaram Project, Palamuru Lift Irrigation, Sundilla Bhaktaramadasu Project) ఇలా ఎన్నో ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు నీరు ఇచ్చామన్నారు. ఇదంతా తాము తయారు చేసిన ఆస్తులు కాదా అని ప్రశ్నించారు. రైతు వేదికలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇలా ఎన్నో నిర్మించామన్నా రు.రైతుబంధుపై రూ.72 వేల కోట్లు, రైతు రుణమాఫీకి రూ.28 వేల కోట్లు, ఆసరా పెన్షన్‌కు… ఇలా ఎన్నింటినో ఇచ్చామన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రైతు రుణ మాఫీ చేస్తా మని చెప్పిందని, కానీ దానిని రూ.25 వేలకు తగ్గించిందని ఆరో పించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం సంతోష మేనని, కానీ వైద్య శాఖకు నిధుల కేటాయింపు తగ్గిస్తే ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్ పేరు నచ్చకుంటే పేరు మార్చి కిట్లు ఇవ్వాలని సూచిం చారు. కానీ రాజకీయాల కోసం పేదల కడుపు కొట్టవద్దని సూచిం చారు. ఆరు గ్యారెంటీలపై బాండ్ పేపర్ ఇచ్చి మరీ మోసం చేశారని మండిపడ్డారు.

బాండ్ పేపర్ వ్యా ల్యూ (Bond Paper Vya Lew)తీసేశారన్నారు.ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రూ.35వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని తెలిపారు. గతంలో రుణమాఫీ కో సం భూములు అమ్మితే భట్టి, శ్రీధర్ బాబు విమర్శించారని. ఇప్పుడు రూ.10 వేల కోట్ల భూములు అమ్మి నిధులు సమీకరిస్తామని చెప్పారని తెలిపారు. రూ.24వేల కోట్లు అద నంగా ఎలా తీసుకువస్తారో చెప్పా లని డిమాండ్ చేశారు. మీ మాటపై గౌరవం ఉంటే భూములు అమ్ముకు నే ప్రతిపాదన ఉపసంహరించు కోవాలన్నారు. సాధ్యం కానీ తర హాలో ఆదాయం ఎక్కువ చూ పార న్నారు. తప్పనిసరి ఖర్చులను తక్కు వ చేసి చూపారని ఆక్షేపిం చారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారని కానీ బడ్జెట్‌లో రూ.2 6వేల కోట్లు మాత్రమే వస్తోంద న్నారు. రుణమాఫీ ఇవ్వడం ఆలస్యం అయిందని రైతుల నుంచి బ్యాంకర్లు వడ్డీ వసూలు చేస్తున్నా రని సభ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రభుత్వం రుణమాఫీ (Government loan waiver) ఆలస్యం చేసి రైతులపై భారాన్ని మోపుతుందని సీరియస్ అయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తాము కొనసాగించామని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్‌లాంటి పథకాల పేర్లు మార్చి పంపిణీ చేసినా త‌మ‌ కు ఎలాంటి అభ్యంతరం లేదన్నా రు.అప్పుల లెక్కలు చెప్పి అమ్మ కాల లెక్కలు చెప్పడం లేదు హరీశ్ రావు అప్పుల లెక్క చెప్పే సమ యంలో అమ్ముకున్న లెక్కలు ఎం దుకు చెప్పడం లేదని సీఎం రేవంత్ నిలదీశారు. ప్రాజెక్టులు కట్టినందుకు అప్పులు అయ్యాయని చెబుతున్న మాజీ మంత్రి. భూములు అమ్మిన విషయం ఎందుకు చెప్పలేదన్నారు. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మారని ఆరో పించారు. రూ.700 కోట్ల గొర్రెల పం పిణీలో భారీ అక్రమాలు జరిగా య న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇటీవల రూ.80 వేల కోట్లు ఖర్చు చేశామన్న బీఆర్ఎస్ (brs), ఇప్పుడు రూ.94 వేల కోట్లు అంటోందని విమర్శించారు.అయితే తాము ఓఆర్ఆర్‌ను విక్రయించలేదని, అది తిరిగి ప్రభుత్వానికే వస్తుందని హ రీశ్ రావు (Harish Rao)తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.94 వేల కోట్లు ఖర్చయ్యాయని తాము మొదటి నుంచీ చెబుతున్నామన్నారు. బతు కమ్మ చీరలపై అసత్యాలు చెప్పి మహిళలను అవమానించారని, ఇందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరారు.

వాటిపై విచారణకు సిద్ధమా

2006లో కేసీఆర్ (kcr)వస్తే పాలమూరు ప్రజలు ఆదరించి గెలిపించారని ముఖ్యమంత్రి అన్నారు. మరి పదే ళ్లలో పాలమూరు ప్రాజెక్టులు ఎందు కు పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలోని భూములు.. ఆస్తులు అమ్ముకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అబద్ధాలు చెబితేనే అసెంబ్లీ ఎన్ని కల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, లోక్ సభ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిజాయతీగా పాలన చేసి ఉంటే… బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ మీద విచారణకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి (Revanth Reddy)సవాల్ చేశారు.