Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish vs Komatireddy: హరీశ్ వర్సెస్ కోమటిరెడ్డి

–అసెంబ్లీలో హరీష్ రావు, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాట‌ల తు టాలు
–బిఆర్ఎస్ మోసాల పార్టీ అన్న కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి
–విద్యుత్ స‌ర‌ఫ‌రాలోనూ అక్ర‌మాలే
కెసిఆర్ స‌భ‌కు ఎందుకు రాలేదు
–కోమ‌టిరెడ్డిది అంతా ఆఫ్ నాలెడ్జ్ అంటూ హ‌రీశ్ కౌంట‌ర్
–ఆకారం పెరిగిందంటూ మంత్రి ఎన్ కౌంట‌ర్
–డ‌మ్మీ మంత్రి, డ‌మ్మీ అల్లుడివి అంటూ హాట్ హాట్ కామెంట్లు

Harish vs Komatireddy: ప్రజా దీవెన,హైద‌రాబాద్: వాద అతివాదాలు, సవాళ్లు ప్రతి సవాళ్లు, నువ్వా నేనా అన్న డైలాగులు ఇలా రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో తరచుగా కనబడేవి వినబడేవి ఇవే. అధికార ప్రతిపక్ష నాయకులు ప్రజాసమస్యలు పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలు సెటర్లతో ఒకరినొకరు కించపరుచు కుంటూ సభ కాలాన్ని వృధా చేస్తు న్నారో అనడానికి శనివారం జరిగిన సమావేశాలు తార్కానంగా కనిపిస్తు న్నాయి . తెలంగాణ అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ పద్దుపై చర్చ హాట్ హాట్‌గా కొనసాగింది. ఈ సందర్భంగా హరీష్ రావు (Harish rao), మంత్రి కోమటిరెడ్డి (Komatireddy)మధ్య మాటల యుద్ధం నడిచింది.

2001లో కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji)ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వస్తే దళితుడినే సీఎం చేస్తామని చెప్పి అబద్ధాలను ఆనా టి టీఆర్ఎస్ (trs)ప్రస్తుత బీఆర్ఎస్ (brs) మొదలు పెట్టిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని చెబితే తాను ఓ సబ్ స్టేషన్ కు వెళ్లి పరిశీలించానని అక్కడే పని చేసే ఆపరేటర్ 9 ఏళ్ల నుంచి ఏనాడు 14 గంటల విద్యుత్ సప్లై కాలేదని చెప్పారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. మోసాలు, అబద్ధాలు బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఏర్పడిన నాటి నుంచే పుట్టాయని మంత్రి సెటైర్లు వేశారు.దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు ఆనాడు కొని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ బడ్జెట్‌పై చీల్చిచెండాడుతాడని పత్రికల్లో వార్తలు వస్తే తాను తొమ్మిది గంటలకు వచ్చి కూర్చున్నానని అయితే కేసీఆర్ కు వచ్చే మొఖం లేక హరీష్ రావును పంపారన్నారు.

ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) స్పందిస్తూ.. కోమటిరెడ్డికి ‘హాఫ్ నాలెడ్జ్’ ఉందనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ కల్పించుకుని హాప్ నాలెడ్జ్ పదం విరమించుకోవాలని హరీష్ రావును కోరి రికార్డుల నుం చి తొలగించారు. దీనికి కోమటిరెడ్డి మాట్లాడుతూ హరీష్ రావుకు ఆకారం పెరిగిందని అసలు నాలేడ్జ్ లేదని కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు గతంలో డమ్మీ మినిస్టర్ అని, డమ్మీ అల్లుడు అని కోమటిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.