Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేయని వారికి శుభ వార్త

ITR Filing: మన భారతదేశంలో మరో మూడు రోజుల్లో ఆదాయపు పన్ను దాఖలు (Income tax filing)చేయడానికి గడువు ముగియనుంది. గడవు ముంచుకొస్తున్నా చాలా మంది ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయలేదని నివేదికలు తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీఆర్ ఫైల్ (ITR file) చేసే గడువు పెంచే అవకాశం ఉంటుందని పలువురు బిజినెస్ నిపుణులు వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు . అయితే పన్ను చెల్లింపుదారులు జూలై 31 2024లోపు ఐటీఆర్‌ను దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మేరకు అందుకు సంబందించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత సంవత్సరం జూలై 31, 2023 నాటికి సుమారు 6.77 కోట్ల ఐటీ రిటర్న్‌లు (IT Returns)సమర్పించగా.. అయితే ఈ ఏడాది ఈ రికార్డు దాటుతుందని అంచనా వేసినా ఆ స్థాయిలో ఐటీఆర్ ఫైల్ కాలేదని నిపుణులు అంచనా . అందువల్లే ఆగస్టు 31 వరకు గడువు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing)గడువు పెంపు గురించి నిపుణుల అంచనాలను చూద్దాం ఇప్పడు…

జూలై 26, 2024 నాటికి ఆర్థిక సంవత్సరం (Financial year)2024-25 కోసం దాదాపు 4.6 కోట్ల మాత్రమే ఐటీఆర్‌లు ఫైల్ చేయడం జరిగింది. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం గత ఏడాది జూలై 31 వరకు 6.77 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ చేయడం జరిగింది. దీన్ని బట్టి పన్ను చెల్లింపుదారులు ఈ సంవత్సరం తమ ఫైలింగ్‌లను ఇంకా పూర్తి చేయలేదనిక్లియర్ గా తెలుస్తుంది. గత సంవత్సరం గమనించిన ట్రెండ్, ప్రస్తుత వేగాన్ని బట్టి, మిగిలిన పన్ను చెల్లింపుదారులకు మేలు కల్పించేలా గడువు పెంచే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇక ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇప్పటివరకు 4,60,15,630 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు చేయగా, వీటిలో 4.23 ఐటీఆర్‌లు ధ్రవీకరించారు. అలాగే 1.9 కోట్ల ధ్రువీకరించిన ఐటీఆర్‌లకు రీఫండ్ ప్రాసెస్‌లో ఉంది. ఈ ఏడాది ఆదాయపు పన్ను నిపుణులు ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు బాగా ఎక్కువగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఆ కారణం వల్లే పన్ను చెల్లింపుదారులు తమ ఫైలింగ్‌లను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారని కూడా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఆదాయపు పన్ను బార్ అసోసియేషన్ (Income Tax Bar Association) (ఐటీబీఏ) ఆదాయపు పన్ను దాఖలు గడువును పొడిగించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా కోరినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులకు ఓ లేఖ కూడా రాసారు . దాదాపు నెల రోజులుగా ఆదాయపు పన్ను పోర్టల్ సరిగ్గా పనిచేయడం లేదని వారు లేఖలో తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా అప్‌లోడ్ (Upload) సంబంధిత సమస్యలు, ఆధార్ ఓటీపీ ధ్రువీకరణ విషయంలో ఇబ్బందులు వస్తున్నట్లు వారు తెలిపారు. అందువల్ల ఐటీఆర్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను అప్‌డేట్ చేయడమే కాకుండా 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరం గడువు తేదీని జూలై 31, 2024 నుంచి ఆగస్టు 31, 2024 వరకు పొడిగించాలని ఆ లేఖలో తెలిపారు. చూడాలి మరి చివరికి ఏమి అవుతుందో ఏమో అనేది.