Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Acidity: అసిడిటిని చెక్ పెట్టండి ఇలా

Acidity: ప్రస్తుత రోజులలో ఉండే బిజి లైఫ్ లో చాల మంది సమయానికి సరిగా తినకపోవడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంతో ఎసిడిటి భారిన పడుతున్నారు. అసిడిటీ, గ్యాస్ట్రిక్ (Acidity, gastric)అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అలాగే ఆహారం తిన్న తర్వాత జీర్ణాశయంలో మంట, ఛాతిలో మంటతో చాల ఇబ్బంది పడుతుంటారు. ఈ ఎసిడిటీతో తరచూ గుండెలో మంట, అజీర్తి వంటి అనారోగ్యాలకూ దారితీస్తుంది. ఇక ఎసిడిటి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులు సూచించిన మందులను కూడా వాడుతూ ఉంటారు. కానీ ఎసిడిటీ సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని రకాల డ్రింక్స్ తీసుకుంటే చాల సులువుగా చెక్ పెట్టచ్చు అని డాక్టర్లు తెలుపుతున్నారు.

అవి ఏమిటంటే .. అసిడిటీ, గ్యాస్ట్రిక్ (Acidity, gastric) సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్న వారు సబ్జా గింజలతో మంచి ఉపశమనం పొందవచ్చు. రోజూ క్రమం తప్పకుండా సబ్జా గింజలు (Sabja seeds) కలిపిన నీటిని తీసుకుంటే మాత్రం మెరుగైన ఫలితాలను పొందవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. ఇందు కొరకు మనం ముందుగా ఒక టేబుల్‌ స్పూన్ సబ్జా గింజలను (Sabja seeds) లీటర్‌ నీటిలో వేసి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ఆ రసాన్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.

ఇక మరొక విధానంలో రోజూ భోజనం చేశాక 1 టీ స్పూన్ సోంపు (Anise) తీసుకోండి. ఇలా తీసుకోవడం వాళ్ళ అసిడిటీ దూరమవుతుంది. సోంపును నేరుగా తీసుకోవచ్చు. లేదా ఓ కప్పు నీటిలో స్పూన్ సోంపును వేసి మరిగించి కూడా తాగా వచ్చు . లేదంటే, టీస్పూన్ సోంపు గింజలను వేడి నీటిలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టిన నీటిని తాగితే ఎసిడిటీ సమస్యల నుంచి బయట పడవచ్చు.అలాగే సోంపు గింజల్లోని నూనె వంటి పదార్థం జీర్ణక్రియకు హెల్ప్ చేసి మంటను చాల సులువుగా తగ్గిస్తుంది. ఇక అలాగే రోజు గ్లాసు చల్లని పాలు తాగడం వల్ల కూడా మీ పొట్టకు ఉపశమనం లభిస్తుంది. ఎసిడిటీ సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అల్లంలోని సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎసిడిటీని (Acidity) తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా నీరు తాగడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలాగే అసిడిటీ (Acidity)సమస్యతో బాధ పడేవారికి అరటిపండు మేలు చేస్తుంది. అరటిపండులో ఆల్కలీన్ లక్షణం ఉండడంతో కడుపు ఆమ్లం కోసం సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా, అరటి పండు కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేయడంలో కూడా బాగా సహాయ పడుతుంది . కనుక మనకు ఎప్పుడైనా ఎసిడిటీ అనిపించినప్పుడల్లా, అరటిపండును సగం తీసుకుని దానిపై నల్ల ఉప్పు వేసి తింటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుందని డాక్టర్లు తెలుపుతున్నారు.. టాబ్లెట్స్ (tablets) కంటే ఇలాంటి సహజమైన విధానాలు వాడడం వాళ్ళ త్వరగా తగ్గే అవకాశాలు ఎక్కువ.