Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay: హిందువులేమైనా బిచ్చగాళ్లా..!

–రంజాన్ కు రూ. కోట్ల నిధులిస్తూ బోనాల ఉత్సవాలకు నిధులెందు కివ్వరు
–పాతబస్తీలో 24 దేవాలయాలకు రూ. 5 లక్షల బిచ్చమేస్తారా
–భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీరుతాం
–తబ్లిగీ జామేతకు రూ.2.4 కోట్ల నిధులివ్వడం సిగ్గుచేటు
–ఎంఐఎం మజ్లిస్ పార్టీ గోడమీద పిల్లిలాంటి మాదీరిది
–అక్బరుద్దీన్ ఒవైసీకి డిప్యూటీ సీ ఎం పదవి ఆఫర్ ఆ పార్టీల అవ కాశవాదానికి పరాకాష్ట
–కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్య లు
–పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బం డి సంజయ్
–గౌలిపురాలో ‘మన్ కీ బాత్’ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించిన సంజయ్
–అనంతరం పాతబస్తీలోని వివిధ ఆలయాల సందర్శనతో బిజీబిజీగా గడుపుతున్న బండి సంజయ్

Bandi Sanjay:ప్రజా దీవెన, హైదరాబాద్: రంజాన్ పండుగకు (Ramadan festival) రూ.33 కోట్లు కేటాయి స్త రా తబ్లిగీ జామాతే సంస్థకు రూ.2.4 కోట్లు ఇస్తరు బోనాల పండుగ (Bonala festival)సం దర్భంగా పాతబస్తీలోని దేవాల యాలకు రూ.5 లక్షలిస్తరా , హిం వులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నరా మీ దగ్గర బిచ్చమెత్తుకో వాల్నా అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే గల్లీగల్లీలో అధికారికంగా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వ హిస్తామ ని ప్రకటించారు. పాతబస్తీ భాగ్య లక్ష్మీ అమ్మవారి (Patabasti Bhagya Lakshmi Ammavari) ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని ఉద్ఘా టించారు. బోనాల పండుగ సం దర్భంగా పాతబస్తీలోని వివిధ ఆలయాల సందర్శనలో బిజీబిజీగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay)తొలుత భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం ‘గౌలిపురా’లో ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. అంతకు ముందు భాగ్యలక్ష్మీ ఆలయ సమీ పంలో మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే…

తెలంగాణ అక్కాచెల్లెళ్లు, అన్నద మ్ములకు తెలంగాణ ఆడబిడ్డ లందరికీ బోనాల పండుగ (Bonala festival) శుభా కాంక్షలు ఇయాళ భాగ్యనగర్ ఆషాడ మాసం సందర్భంగా గల్లీగల్లీలో ప్రారంభమైన బోనాల జాతర (Bonala festival)) రాష్ట్ర వ్యా ప్తంగా భక్తియుత ధార్మిక వాతా వరణంలో వైభవంగా నిర్వ హించుకుంటున్నాం. అన్ని కుటుం బాలు కలిసి సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించుకుం టున్నాం. బోనం అంటే అమ్మవారికి ఇష్టంగా సమర్పించే నైవేద్యం. నైవేద్యం సమర్పిస్తే కష్టాలు తీరు తాయని నమ్మకం. 1908లో మూసీ నది వరదలతో హైదరాబాద్ మొ త్తం అతలాకుతలమైతే ఇట్లనే అమ్మవారికి మొక్కుకుంటే తగ్గిపోయింది. అప్పటి నుండి లాల్ దర్వాజా అమ్మవారికి బోనాల ఉత్సవాలను జరపడం ఆన వాయితిగా మారింది. భాగ్యనగ రాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎల్లవేళలా రక్షిస్తున్న మన భాగ్యల క్ష్మీసహా అమ్మవార్లందరినీ దర్శిం చుకునేందుకు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. 1869లో హైదరాబాద్‌లో ప్లేగ్ వ్యాధితో జనం పిట్టల్లా రాలిపోతుంటే ఈ వ్యాధి తగ్గితే అమ్మవారికి గుడి కట్టించి బోనాలు జరుపుతామని అప్పటి జవాన్లు, ప్రజలు మొక్కుకున్నారు.

అమ్మవారి దయతో ఆ వ్యాధి తగ్గి పోవడంతో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి గుడి (Secunderabad Mahankali Goddess Temple) కట్టించి ఘనం గా బోనాల ఉత్సవాలు జరుపు కుంటున్నం.ఈ పండుగకు ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ వానా కాలంలో అనేక రోగాలు పుట్టుకొస్తయ్. బోనం చుట్టూ పసుపు పూస్తం. వేపాకులు కడ్తం. దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్ లు నాశనమై మన ఆరోగ్యం పైలంగా ఉంటదని నమ్ముతం.నేను ఇయాళ ఇటొస్తుంటే ఓ పెద్దాయన నాతో ఏమన్నడంటే నాకు పాతబస్తీని చూస్తే గుబులు పట్టుకుంది. యాక త్ పురా కోమటివాడ, చందులాల్ బారాదరి, చావునిసహా పాతబస్తీలో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు బోనాలు జరుపుకునేందుకు పరిస్థితి లేదని బాధపడ్డడు. ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగకు హాజరయ్యే దుస్ధితి ఏర్పడిందని వాపోయాడు.

రాబోయేది బీజేపీ (bjp) ప్రభుత్వమే. పాతబస్తీలోనే కదా గల్లీగల్లీలో, బస్తీ బస్తీలో అధికారికంగా ప్రతి ఏటా బోనాల పండుగ జరుపుకునే అవ కాశం రావాలంటే అన్ని వర్గాలను సమానంగా చూసే బీజేపీ ప్రభుత్వం రావాలి. అది కచ్చితంగా వచ్చి తీరుతుంది. దురద్రుష్టమేమిటంటే ప్రభుత్వాలు మారినా వివక్ష, సంతూష్టీకరణ విధానాలు మాత్రం మారడం లేదు. పాతబస్తీలో బోనాల పండుగ (Bonala festival) నిర్వహణ కోసం 24 దేవాలయాలతో కమిటీ ఉంటే రూ.5 లక్షలు మాత్రమే ఇవ్వడం దారుణం. బిచ్చమెత్తుకునే దుస్థితి ఏర్పడింది. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులిచ్చి గొప్పలు చెప్పుకోవడం కాదు బోనాల పండుగకు ఎన్ని నిధులు కేటాయించినమని ఆత్మవిమర్శ చేసుకోవాలి.రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు మేమైనా వద్ద న్నమా ఇంకా రూ.10 కోట్లు ఇచ్చు కోండి. కానీ హిందూ పండుగలకు ఎందుకివ్వరు? బోనాలు, గణేష్ ఉత్సవాలతోపాటు నవరాత్రి ఉత్స వాలు జరుపుకుంటాం కదా ఎందు కు నిధులివ్వరు,భాగ్యలక్ష్మీ అమ్మ వారి ఉత్సవాలకు ఎందుకు నిధు లివ్వరు బీజేపీ అధికారంలోకి వస్తే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెం పుల్ గా (golden temple)మార్చి తీరుతాం.తబ్లిగీ జమాతే వంటి నిషేధిత సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్ల 4 లక్షలి చ్చిందంటే ఏమనాలి? ఇదేనా సెక్యూలరిజమంటే ఇదేదో దేశానికి సేవ చేసినట్లు బడ్జెట్ లో ప్రస్తా వించిర్రు సిగ్గుండాలే, హిందువు లంత పనికిరాకుండా పోయారా ఇంత స్థాయికి దిగజారాలా, ఇట్లనే వ్యవహరించిన గత పాలకుల పరి స్థితి ఏమైందో అర్ధం చేసుకోవాలి.

నేను వాస్తవాలు మాట్లాడితే మతత త్వవాది అంటారా అయినా సరే బరాబర్ మాట్లాడతా, నేనేమీ మతా నికి వ్యతిరేకంగా మాట్లా డటం లేదు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే మాట్లాడి తీరుతా. హిందువులను బిచ్చగాళ్లగా చూడొద్దు. ఇకనైనా అన్ని వర్గాలను సమానంగా చూడాలని కోరు తున్నా. గతంలో మజ్లిస్ నేత కేసీఆ ర్ ను (kcr) అంకుల్ అనే వాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అన్న అని సంబో ధిస్తు న్నడు. అన్నదమ్ముల సంబం ధం మొదలైందేమో మజ్లిస్ నేతలు గోడమీద పిల్లులు. ఎవరు అధి కారంలో ఉంటే వాళ్ల పంచన చేరడం వాళ్లకు అలవాటే. మొన్న టిదాకా కాంగ్రెస్ ను తిట్టి బీఆర్ఎస్ గడీలకు పోయిర్రు. ఇప్పుడు బీఆర్ ఎస్ ను తిట్టి కాంగ్రెస్ పంచన చేర తరు. ఎందుకంటే వాళ్లు చేసే వ్యాపారాలు బాగుండాలే. ఓల్డ్ సిటీలో ట్యాక్స్ లు, బిల్లులు కట్టొద్దనే భావన వాళ్లది.

కొడంగల్ వాళ్ల అయ్య జాగీరా పంచు కోవడానికి కొడంగల్ లో పోటీ చేస్తే డిపాజిట్ (deposit)రాకుండా చేస్తాం.. ఒక్కో కాషాయ కార్యకర్త, ఒక్కో యువకుడు ఇంటికి ఇంఛా ర్జీగా ఉంటూ ఆ రెండు పార్టీల అడ్రస్ గల్లంతు చేస్తం15 నిమిషాలు సమయమిస్తే హిందువులను నరికి చంపుతానన్న వ్యక్తిని డిప్యూటీ సీఎం పదవిస్తానని చెప్పడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.