–లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం లో సభ ద్రుష్టికి తీసుకొచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
Kiran Kumar Reddy:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలలో (Sessions of Parliament) భాగంగా లోక్ సభలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నతో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధి లో కాలుష్యంపై గలమెత్తారు. భువ నగిరి పార్లమెంట్ నియోజకవ ర్గం (Bhuva Nagiri Parliamentary Constituency) లోని చౌటుప్పల్, పోచంపల్లి మం డలాలలోని పలు గ్రామాలు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి స్థానికంగా గల 10 నుంచి 15 ఫా ర్ములేషన్, కెమికల్ ఇండస్ట్రీల నుం చి వచ్చే వ్యర్థాల వల్ల భూగర్భ జలా లు తీవ్రంగా దెబ్బతింటున్నా య న్నారు.
ఈ పరిశ్రమలు వెదజల్లు తున్న కెమికల్ గ్యాస్ వల్ల వాతా వరణం కలుషిత మవుతోందని ఆం దోళన వ్యక్తం చేశారు. దురదృష్టవ శాత్తు ప ర్యావరణ మంత్రిత్వ శాఖ (Ministry)ఈ పరి శ్రమలను కాలుష్య రహిత కేట గిరిలో ఉంచడం జరిగిందని, ఈ పరి శ్రమలు కార్పొరేట్ (Corporate) పెద్దలకు చెం దినవి కావడం వలన ఎలాంటి యా క్షన్ తీసుకోవడం లేదని, దీనిపై కేం ద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసు కోవాలని పార్లమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువ చ్చారు.