Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sudagani Uday Kiran: నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జిల్లా చైర్మన్ గా సుదగాని ఉదయ్ కిరణ్

Sudagani Uday Kiran: ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా ఆలేరు నియోజకవర్గానికి చెందిన సుదగాని ఉదయ్ కిరణ్ (Sudagani Uday Kiran) ను నియమిస్తూ హైదరాబాద్ లోని తెలంగాణ సరస్వత పరిషత్ ఆడిటోరియంలో (Telangana Saraswata Parishad Auditorium)జరిగిన కార్యక్రమంలో ఎన్సిఆర్సి జాతియ చైర్మన్ డాక్టర్ ఎం.వి.ఎల్ నాగేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లు నియామకపు ఉత్తర్వులు అందచేశారు.

ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ (Sudagani Uday Kiran) కొంత మంది స్వార్ధపరులు సొంత లాభం కోసం చిన్నపిల్లలు తాగే పాల దగ్గరి నుండి ప్రాణాపాయ పరిస్థితులలో అందించే ఔషధాల వరకు అన్నిటిని కల్తీచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, మరో వైపు కార్పోరేట్ కంపెనీలు, బడా వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్ లు నిర్లక్ష్యంతో కాలం చెల్లిన నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తున్నాయని ప్రతి రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నామని ఇలాంటి పరిస్థితులను అడ్డుకునేందుకు నేషనల్ కన్స్యూమర్ వైట్ కమిషన్ వినియోగదారులకు అండగా ఉంటుదని ఉదయ్ కిరణ్ తెలిపారు. చట్ట పరంగా తమ హక్కులను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పోరాడి కల్తీభూతాన్ని తరిమి కోట్టాలని పిలుపు నిచ్చారు. తనకు ఈ బాధ్యతలను ఇచ్చిన ఎన్.సి.ఆర్.సి ఫౌండర్ ,జాతియ చైర్మన్ డాక్టర్ ఎం.వి.ఆర్ నాగేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ (Telangana State Chairman)డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.