Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : రైతు ప్రయోజనo మావిధానం

--రెండో విడత రుణ మాఫీ నిధుల విడుదల సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి --రుణమాఫీతో మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం --రెండో విడతగా రూ. 12224.98 కోట్ల రుణాలు మాఫీ చేసినం --కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమ ని రుజువు చేశాం --ఆగస్టులో రూ. 2లక్షల లోపు రుణాలన్నీ మాఫీ ఖాయం --గత ప్రభుత్వం చేసిన మిత్తి కింద ఇప్పటిదాకా రూ. 43 వేల కోట్లు కట్టినం --రుణమాఫీ పై శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి

రైతు ప్రయోజనo మావిధానం

–రెండో విడత రుణ మాఫీ నిధుల విడుదల సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి
–రుణమాఫీతో మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం
–రెండో విడతగా రూ. 12224.98 కోట్ల రుణాలు మాఫీ చేసినం
–కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమ ని రుజువు చేశాం
–ఆగస్టులో రూ. 2లక్షల లోపు రుణాలన్నీ మాఫీ ఖాయం
–గత ప్రభుత్వం చేసిన మిత్తి కింద ఇప్పటిదాకా రూ. 43 వేల కోట్లు కట్టినం
–రుణమాఫీ పై శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకా రం రైతు రుణమాఫీ (Farmer loa n waiver) రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి విడుదల చేశారు. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం రూ. 6,1 91 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండో విడతలో భాగంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ( CM revanth reddy) ప్రారం భించారు.

వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పం పిణీ చేశారు.కాంగ్రెస్ ప్రభు త్వం వ్యవసాయం ( agriculture ) పండుగని నిరూపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవని, వ్యవసాయం పం డుగ తమకు రాజకీయ ( polit icol)  ప్రయోజనాలు ముఖ్యoకాదని, రైతుల ప్రయోజనాలే మా విధాన మని సీఎం చెప్పారు. నెహ్రూ నుంచి శాస్త్రి వరకు ఆహార, దేశ భద్ర తలకు అత్యంత ప్రాధాన్యం ఇ చ్చారని చెప్పారు.

అక్కడి నుంచే జై జవాన్  జై కిసాన్ ( jai kisaan) అనే నినాదం వచ్చిందని గుర్తు చే శారు. ఈ దేశంలో మోదీ ప్రభు త్వం కార్పొరేట్ సంస్థలు 14 లక్షల కోట్ల రూపాయల బ్యాంకులకు ఎగ వేశా యని గుర్తు చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఆ పని చేయరని అ న్నారు. అప్పుల పాలైనా వ్యవ సాయం వదలరని చెప్పారు. తెచ్చి న అప్పులు కట్టలేకపోతే తన పొలం దగ్గరికి పోయి పురుగుల మం దు తాగి ఆత్మహత్యలు చేసుకుంటారని అన్నారు.

వాళ్లకు అండగా నిలబడి ధైర్యం చెప్పడమే ధ్యే యంగా తమ ప్రభు త్వం ( governaments) పనిచేస్తుందని చెప్పారు. రైతులు ఆనందంగా ఉండా లని, సంక్షోభంలో కూరుకు పోవద్దని ఆ నాడు రాహుల్ గాంధీ ఆధ్వర్యం లో రైతు డిక్లరేషన్ ప్రకటించామని, దానిని తూచా తప్పకుండా అమ లుచేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ (con gress) పార్టీ మాట ఇస్తే అది శిలా శాసనమవుతుందని అన్నారు.

గత ప్రభుత్వం పదేండ్లు పాలించి రూ. లక్ష రుణమాఫీ చేయ లేక యిందని అన్నారు. తమకు చిత్త శుద్ధి ఉన్నందునే సంకల్పాన్ని నెర వేర్చామని చెప్పారు. ఆర్థిక సంక్షో భాన్ని ఎదుర్కొంటున్న ఈ రాష్ట్రం లో రుణమాఫీ సాధ్యం కాదని చా లా మంది శాపనార్థాలు పెట్టారని గుర్తు చేశారు. మాటా తప్పుతా మని చాలా మంది అన్నారని కానీ ఇదీ మా చిత్తశుద్ధి ( commitment) అని నిరూపించామని చెప్పారు.

జులై 18 నాడు మొదటి విడతలో లక్షలోపు రుణాలున్న వారి లోన్లు మాఫీ చేశామని, మంగళవారం  లక్షన్నర లోపు బాకీ ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశామని చెప్పారు. రాష్ట్రాన్ని తాక ట్టు పెట్టిన కేసీఆర్ గత ముఖ్యమం త్రి కేసీఆర్ ( kcr) రాష్ట్రాన్ని తాకట్టు పెట్టా రని, ఆయన చేసిన అప్పుల కు వడ్డీ కింద ఇప్పటి వరకు 43 వేల కోట్ల వడ్డీ కట్టామని సీఎం చెప్పారు. దీం తో ప్రతి నెలా మొదటి తారీ ఖున జీతాలు, పించన్లు ఇస్తున్నామని అన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ ( Rajiv arogya Sri) అమలు చేస్తున్నామని, ఫీజు రీయిం బర్స్ మెంట్ చెల్లిస్తున్నామని అన్నారు.

ఇందిరమ్మ ( indh iram ma) ఇండ్లకు అనుమతి ఇవ్వడంతో పాటు అంగన్ వాడీల నుంచి ఆశవర్కర్ల వరకు జీతాలు సకా లంలో చెల్లిస్తున్నామని చెప్పారు. అప్పుల రాష్ట్రంలో ఇవన్నీ ఇస్తూనే 12, 500 కోట్ల రూపాయల రుణమాఫీకి సర్దిన ఆర్థిక మంత్రి భట్టి విక్ర మార్క ( finance minister vikrama arka) ను, అధికా రులను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు చెప్పారు.

ఆగస్టు ( august ) నెల చరిత్రలో లిఖించదగినదని, ఆ నెలలో రైతుల రుణాలు పూర్తిగా తీరిపోతాయని చెప్పారు. 77 ఏండ్ల స్వా తంత్య్ర భార తం లో ఏ రాష్ట్రం కూడా 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేయలేదని, తా ము మాత్రమే చే స్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన మంత్రివర్గ సహచరులు, అధికారులకు సీఎం పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

*ఆర్థిక ఇబ్బందులున్నా రైతు బంధు: తుమ్మల*

ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతుబం ధు ఇచ్చి తీరుతామని వ్యవసా యశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ( thummala nag eswar Rao) అన్నారు. మంగళవారం అ సెంబ్లీ ఆవరణలో నిర్వ హించిన రెండో విడుత రుణమాఫీ కార్యక్ర మంలో ఆయన మాట్లా డుతూ గాంధీ కుటుంబం (gandhi fa mily) మాట ఇస్తే తప్పదని, ఆ మేరకు మంగళవారం  2 లక్షల లోపు రైతుల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని చెప్పా రు.

ఇప్పుడు 1 వేల కోట్ల రుణమా ఫీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్న ట్టు తుమ్మల చెప్పారు. త్వరలోనే పంట బీమాను కూడా ప్రారంభి స్తామని అ న్నారు. రైతు భరోసా విషయంలో అన్ని జిల్లాల రైతుల నుంచి అభిప్రా యాలు తీసుకుంటున్నామని అ న్నారు. తాము గత ప్రభుత్వం లా గా రైతు బంధు ఇవ్వబోమని అన్నా రు. రైతుల అభి ప్రాయాల మేరకే ఈ ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు.

*త్వరలో పంటల బీమా: డిప్యూటీ సీఎం భట్టి*

రాష్ట్రంలోని రైతుల పంటలను ప్రభుత్వం బీమా చేస్తోందని డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( m inister batti vikram aarka) అన్నారు. వరంగల్ డిక్లరేషన్ కు వెళ్లే ముందు రూ.2 లక్షల రుణ మాఫీ సాధ్యమా అనే చర్చవచ్చిం ది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐ సీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ( rahul gandhi) సాధ్యమే మనం చేయాల్సిందే అని చెప్పారు.

బిఆర్ఎస్ సర్కారు లక్ష రూపాయల రుణ మాఫీని నాలుగు దఫా లుగా చేసింది. వడ్డీలు పెరిగి రైతులు ఇబ్బంది పడిన పరిస్థితిని చూశా మనే చర్చ వచ్చింది. ధనిక రాష్ట్ర మైన తెలంగాణ (tela ngana)  లో ఇది సాధ్యమా అనే సందేహాలూ వచ్చాయి. మన కు సంకల్పం ఉంది చేద్దాం అన్నా రని చెప్పారు. అలాంటి సంకల్పా న్ని నిజం చేస్తున్నా మన్నారు.

ఆగస్టు లోపు 2 లక్షల రూణాన్ని మాఫీ చేస్తున్నా మని చెప్పారు. బి ఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వది లేసిన 1,350 కోట్లతో పంటల బీమాను రాష్ట్ర ప్ర భుత్వం చేయ బోతోందన్నారు. బ్యాంకుల్లో ఉన్న రుణమంతా ఒక్కటే సారి మాఫీ అవుతుంటే రైతులు సంతోషంగా పండుగా చేసుకునే రోజని భట్టి తెలిపారు.

CM Revanth Reddy