Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Katepalli Venkataramana Reddy: ఆ పని చేస్తే నా పాఠశాలలు మూసేస్తా

–సెటైర్లు వేయడం నా సంస్కృతి కాదు
–బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమ ణా రెడ్డి

Katepalli Venkataramana Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలను ఆధు నీకరించి కొత్త భవనాలు మౌలిక వసతులతో ప్రయి వేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దా లని, అప్పుడు నాకున్న ఒక ప్రైవేట్ పాఠశాల (Private school) లను అవసరమైతే మూసివేసేందుకు నేను సిద్ధమని, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి (Katepalli Venkataramana Reddy) స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడిన అనంతరం మీడియా పాయింట్లో మాట్లా డారు. సీఎం కుమారుడి నుంచి బంట్రోతు కొడుకు వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలనే ఆలోచన వచ్చే విధంగా ప్రభుత్వ పాఠశా లలను తయారు చేయా లన్నారు. అలాగే ప్రభుత్వం 317, 46 జీవో లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అసెంబ్లీ మార్గద ర్శకంగా నడవాలని, అసెంబ్లీ నడుస్తుంటే సభ సంస్కా రాలు పాటించాలని, సభ్యుడు చెప్పేది అందరూ వింటే మాట్లాడే వ్యక్తికి ఉత్సహం వస్తదన్నారు.

నేను ఎంఎల్ఎ (mla) అవ్వడం కాస్త ఆలస్యం అయ్యిందని, నేను వంకర తోవలో గెలవాలి అంటే ఎప్పుడో ఎంఎల్ఎ అయ్యేవాడినని, సైటైర్లు నేను కూడా వేయగలనని, కానీ అది నా సంస్కృతి కాదన్నారు. అసెంబ్లీలో మాట్లా డేందుకు తగిన అవకాశం రానందున మీడియాలో (media)పాయింట్ లో సభ గురించి మాట్లాడాననని వెంకట రమణరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ధరణిని వీలై నంత త్వరగా ప్రక్షాళన చేయాలని, ధరణితో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని, భూ రికార్డులలో మార్పులకు సామాన్యులు కలెక్టర్ వద్దకు వె వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిం దన్నారు. వీఆర్ఎలు, పంచాయతీ ఉద్యోగుల సమ స్యలు పరిష్కరించాలని కోరారు. లక్షన్నర రైతు రుణ మాఫీ చేయడం శుభపరిణామమని, రైతులకు ఇబ్బంది లేకుండా మిగతా రుణమాఫీ చేసి, ధాన్యం కొనుగోలు కళ్లాల వద్ద సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు..మాజీ ఎమ్మెల్యే లకు తిరిగి గన్ మెన్ లను కేటాయించాల న్నారు. రాజకీ యాలకు అతీతంగా ఉద్యమకా రులకు కూడా సెక్యూరిటీ (Security) ఇవ్వాల న్నారు.