Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SI Mallesh:లైట్ మోటార్ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు……
కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్……..

SI Mallesh: లైట్ మోటార్ వాహనదారులు (Light motor vehicles) విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ. మల్లేష్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద లైట్ మోటార్ అసోసియేషన్ సభ్యులతో ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) పై అవగాహన కల్పించి మాట్లాడారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం చట్ట రిత్య నేరమని హెవీ లైసెన్స్ కానీ బ్యాడ్జి కలిగి ఉన్న డ్రైవర్లు మాత్రమే డ్రైవింగ్ చేయాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని రాత్రి వేళ డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్లు తగినంత విరామం తీసుకోవాలన్నారు.

ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules)అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ప్రమాదాలు జరగకుండాప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో. ఏఎస్ఐ (asi) కొంగల వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ ఎరగని రామయ్య, లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.