— బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్
Nagarjuna Mudiraj: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున (Nagarjuna Mudiraj) ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ లో విద్యార్థుల సమస్యల పట్ల ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ (Nagarjuna Mudiraj) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యా ర్థులు ముందుండి కొట్లాడారు కాబ ట్టి విద్యార్థుల సమస్యల గురించి తెలుసుకున్న గత సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలను ఏర్పా టు చేసి మరియు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించా లని సన్న బియ్యం పథకం (Rice scheme) తీసుకు వచ్చి ఒక్కొక్క గురుకుల పాఠశాల లో ఒక విద్యార్థిపై 1,30,000 ఖర్చు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆహారాన్ని అంద జేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గారు అయిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కటి కూడా అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేస్తూ అదే విధంగా గత ఏడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది విద్యార్థులు ఆయా గురుకుల మరియు సంక్షేమ హాస్టల్లో చనిపోయారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18 మంది విద్యార్థులు కలుషిత ఆహారం మరియు పాముకాటు వేధింపులు తో చనిపోవడం జరిగిందని ఆరోపించారు.
దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ (demand) చేశారు. అదేవిధంగా కేసీఆర్ గారు గత పది సంవత్సరాల పాలనలో విద్యారంగానికి బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడు శాతం మాత్రమే బడ్జెట్లో నిధులు (Funding in the budget) కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా విద్యార్థులకు రక్షణ కల్పించి నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో BRSV జిల్లా నాయకులు జిల్లా నాయకుడు మేడబోయిన వెంకన్న యాదవ్, నవీన్ కుమార్, శంకర్, లింగసామి, రమేష్, సతీష్, కుమార్, ఆంజనేయులు, విజయ్, దయాకర్, అజయ్, రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.