–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం దక్కుతుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) అన్నారు. బుధ వారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆవరణలో (Premises of Industrial Training Institute) నిర్మాణంలో ఉన్న నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం, అడ్వాన్సు టెక్నాలజీ కేంద్రా ల( ఏటీసీ) పనులను తనిఖీ చేశారు.ప్రభుత్వ బాలుర, బాలికల పారిశ్రామిక శిక్షణ సంస్థలను సందర్శించడమే కాకుం డా వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల తరగతి గదులకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడారు. అంతేగాక నూతనంగా ఐటిఐ లలో చేరిన అభ్యర్థులతో సైతం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రాం అసిస్టెంట్ ,ఎలక్ట్రిషన్ వర్క్ షాప్ తదితర తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు . ఎక్కడినుండి వచ్చారని? ఏం చదివారని? ఏ ట్రేడ్ లో శిక్షణ పొందుతున్నారని? ఐటిఐ (iti)లో చేరడం వల్ల ఉపాధి కలుగుతుందని ఎలా తెలిసిందని? విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంత రం జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ ఏ రంగంలోనైనా ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా కష్టపడి పని చేయాలని, ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనకు, ఎదుటివారికి తేడా స్పష్టంగా కనపడేలా ఉండాలని, ఇందుకు నైపుణ్యాలను బాగా అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎంచుకున్న రంగంలో మంచి ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. ఇందుకు విద్యార్థి దశలోనే బాగా కష్టపడి చదవడం, నేర్చుకోవడం, నైపుణ్యాలను అభివృద్ధి (Study hard, learn, develop skills)పరచుకోవడం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమున్న ఐటిఐ ల స్థాయి పెంచడంలో భాగంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదని ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65 అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల నిర్మాణం చేపట్టగా, నల్గొండ జిల్లాలో నల్గొండ బాలురు, బాలికలు, అనుముల ,డిండి లలో వీటిని నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు.
ఒక్కో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (Advance Technology Center)ఆరు కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టడం జరిగిందని, నల్గొండ జిల్లాలోని ఐటిఐ(iti) లో సైతం ఈ నిర్మాణాలు కొనసాగుతున్నా యని ఆయన స్పష్టం చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల ద్వారా నూతన యంత్ర పరికరాలతో స్వల్ప కాలిక దీర్ఘకాలిక శిక్షణలను ఇవ్వడా నికి ఆస్కారం ఏర్పడుతుందని, వీటి ద్వారా శిక్షణ పొందిన వారు సులభంగా మార్కెట్లో వెళ్లి స్థిరపడవచ్చు అని చెప్పారు. వచ్చే సంవత్సరంనాటికి పూర్తిస్థాయిలో ఇవి ఏర్పాటు కానున్నాయని ,అందువలన జిల్లా విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలుర బాలికల ఐటిఐ ప్రిన్సిపాల్ లు, లెక్చరర్లతో మాట్లాడుతూ సిబ్బంది, ఉద్యోగులందరూ ప్రోటోకాల్ ప్రకారం విధులకు హాజరు కావాలని, ఎవరు గైర్ హాజరు కావద్దని అన్నారు. డిసెంబర్ లోపు నిర్మాణంలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలను పూర్తి చేసి అప్పగించాల్సిందిగా ఆయన కోరారు. వీటిని త్వరగా పూర్తి చేసేందుకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల వల్ల స్వయం ఉపాధి పెరుగుతుందని, విద్యార్థుల్లో నూతన సాంకేతికత ఆధారంగా ఉపాధి కల్పించేందుకు మంచి అవకాశం ఉంటుందని చెప్పారు .డిసెంబర్ చివరి నాటికి ఎట్టి పరిస్థితులలో వీటిని పూర్తి చేయాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. టిఎస్ఐఐసి జోనల్ మేనేజర్ సంతోష్ కుమార్, మేనే జర్ నాగరాజు, ప్రిన్సిపల్ నరసింహ తదితరులు ఉన్నారు.