–అగ్ని ప్రమాదంలో ముగ్గురు బాలికలు సజీవ దహనం
— ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో దుర్ఘటన
Fire Accident:ప్రజాదీవెన, నోయిడా: ఎప్పటిలానే అంతా రాత్రి వేళ భోజనం (Dinner at night)చేసి నిద్రకు ఉపక్రమించారు.. కుటుంబసభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు.. ఈ క్రమంలోనే.. ఎక్కడో ఇంట్లో అగ్గి (Fire Accident:) రాజుకుంది.. నిద్రలో ఉన్న వారందరికీ.. ఏం చేయాలో అర్ధం కాలేదు.. క్షణాల్లోనే ముగ్గురు కూతుళ్లు కాలి బూడిదయ్యారు.. తల్లిదండ్రులు కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది.. నోయిడా సెక్టార్ (Noida Sector)8 లో ఉన్న మురికివాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు బాలికల సజీవ దహనం అయ్యారు. వారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకొని గాయపడినవారిని ఆసుపత్రిలో చేర్చారు. బాలికల తండ్రి శరీరంపై 60-70 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయని నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ వర్మ తెలిపారు. తొలుత జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లికి స్వల్ప గాయాలు అయ్యాయని.. ఆమెకు కూడా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమా..?
తెల్లవారుజామున 3-4 గంటల మధ్య మంటలు చెలరేగినట్లు జిల్లా మేజిస్ట్రేట్ (Magistrate)తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు బృందాలు, అగ్నిమాపక దళం, జిల్లా మెజిస్ట్రేట్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.. ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతోందని డీఎం తెలిపారు. మంటలు చెలరేగిన సమయంలో ఐదుగురు కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్నారని.. వారు తప్పించుకోవడానికి వీల్లేకుండా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు (police) తెలిపారు.