— సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపాటు
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అవ మానించారని గురువారం బీఆర్ ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు. ప్రతిపక్షం ఎందుకు ఇలా వ్యవహరి స్తుందో తెలియడం లేదన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజ కీయం చేస్తున్నారని మండి పడ్డా రు. అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారా వాళ్లను నేను సొంత అక్కల్లా (sister) భావిస్తున్నా అని తెలిపారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించిన తీరు చూస్తే చెప్పుతో కొడతారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివాసీ బిడ్డను అవమానిస్తే ఊరుకుంటామా.. ఆదివాసీ బిడ్డను (Adivasi child)అవమానిస్తే ఊరుకుందా మా అని సీఎం ప్రశ్నించారు. సునీ తా, సబితా ఇంద్రారెడ్డి (Sunitha and Sabitha Indra Reddy)కోసం నేను కొట్లాడిన అని తెలిపారు. నన్ను నమ్ముకున్నా అక్కలు మంత్రులు గా ఉన్నారని తెలిపారు. ఒక అక్క నన్ను నడి బజారులో వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికీ కోర్టుల్లో తిరుగుతున్న,ఎన్నికల కోసం నేను వెళ్తే ఇంకో అక్క నాపై రెండు కేసులు పెట్టిందని, ఆ కేసుల తో ఇప్పటికీ నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. దిక్కుమాలిన తమ్ము డిని నమ్ముకున్న మీరు ఏమయ్యా రని సునీతా, సబితా ఇంద్రారెడ్డికి హితవు పలికారు. సొంత చెల్లెలు గురించి మాత్రం వారు మాట్లాడరని తెలిపారు. దళితుల పట్ల కేసీఆర్ కు ప్రేమ లేదని, గతంలో దళితుల కు డిప్యూటీ సీఎం ఇచ్చి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు దళిత స్పీకర్ (Dalit speaker)ముందు కూర్చోలేక కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారని తెలిపారు.
నా సొంత అక్కలుగా భావించా… బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను (Sabita Indra Reddy, Sunita Lakshmar Reddy) నేను నా సొంత అక్కలుగానే భావించా. సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడు తున్నారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా, సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు వారు. అక్కా మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దు. మీ ముందు కింద కూర్చో కూడదనే కేసీఆర్ సభకు రావడం లేదు. మైక్ ఇస్తే శాపనార్థాలు, ఇవ్వకపోతే పోడి యం దగ్గర నిరసనలు చేస్తున్నారు. నేను చెల్లెలు జైల్లో ఉంటే రాజకీ యాల కోసం బజార్‌లో తిరిగేవాడి ని కాదు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.అక్కల క్షేమం కోరే చెబుతున్నావాళ్ల ఉచ్చులో పడొద్దు. దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే నిలబడాల్సి న అవసరం ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయిం ది. అందుకే వాళ్ల నుంచి ఏమైనా ఆశిస్తే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే. వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటు న్నా. సాయంత్రం స్కిల్స్ యూనివ ర్సిటీ భూమిపూజకు రావాల్సింది గా అందరినీ కోరుతున్నా. బీఆర్ఎ స్ నేతలకు రాజకీయ ప్రయోజనం తప్ప, ప్రజల ప్రయోజనం పట్టదు. రైతు రుణమాఫీపై చర్చ జరగకూడ దని బీఆర్ఎస్ నేతలు ఆడబిడ్డల ను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. స్కిల్స్ యూనివర్సిటీ పై చర్చ జరగకూడదని అడ్డుకోవా లని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (revanth reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.