–అన్నింటి మాదిరిగానే స్కిల్ యూ నివర్సిటీలో రిజర్వేషన్లు పాటిస్తాం
–గతంలో కొద్దిమంది కోసం యూని వర్సిటీలు దారా దత్తం చేశారు
— ఫీజు రీయంబర్స్మెంట్ సైతం వర్తిస్తుంది
Batti Vikramarka:ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లోని నిరుద్యోగ యువతీ యువ కులు ఉపాధి పొందడానికి గొప్ప యూనివర్సిటీ స్కిల్ యుని వర్సిటీ (University Skill University). సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర క్యాబినెట్ మొత్తం యువతీ యువకుల కోసం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారని తెలంగాణ డి ప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క (Batti Vikramarka)తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కోసం ఆశగా ఎదురుచూస్తున్న యువతి, యువకుల కోసం ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. గౌరవ సభ్యులు చేసి న సూచనలు సలహాలు బిల్లులో పొందుపరుస్తామని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశం సందర్భంగా పై ఆయన మాట్లాడారు.
గతంలో కొన్ని యూనివర్సిటీలు తెచ్చారు వాటిలో ఎక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీ విద్యార్థి, విద్యార్థులకు (BC SC STs for minority students and students) ఆ యూనివర్సిటీలలో ఎక్కడ అవకాశం లేదని, కొద్దిమంది వ్యక్తుల కోసం యూనివర్సిటీలు ధారా దత్తం చేశారని ఆరోపించారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయకుండా అన్ని వర్గాల కు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు పొందుపరిచి బిల్లును ముందుకు తీసుకెళుతున్నామని గుర్తు చేశారు. రిజర్వేషన్లతో (reservations )పాటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తిస్తుంది, ఫీజు రియంబ ర్స్మెంట్ పథకం కింద కవర్ కానీ వి ద్యార్థులకు ఫీజు తగ్గించే అంశాన్ని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గవ ర్నింగ్ బాడిలో ఎస్సీ, ఎస్టీలకు కా కుండా ఓబీసీలు మైనారిటీలకు ఛాన్స్లర్ ద్వారా నామినేట్ చేసే అవకాశం ఉండాలని సభ్యులు కోరగా తప్పకుండా కల్పిస్తామని, గొప్ప ఉన్నత ఆశయంతో ముందు కు తీసుకొచ్చిన స్కిల్ యూనివ ర్సిటీ బిల్లును అందరూ సంతోషం గా మద్దతు ఇచ్చి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.