–దిగువకు 5 లక్షల క్యూసెక్కులు
–ఎగువ నుంచి 3 లక్షల క్యూసెక్కు ల ఇన్ ఫ్లో
–నాగార్జున సాగర్ లో పెరుగుతున్న నిల్వలు
Srisailam project: ప్రజా దీవెన, హైదరాబాద్: నాగార్జునసాగర్ (Nagarjunasagar) వైపు కృష్ణమ్మ ఉత్సాహంగా పరవళ్ళు తొక్కు తోంది. ఎగువన శ్రీశైలం (Srisailam project)పూర్తిస్థాయి నిల్వ సామర్ధ్యానికి చేరుకోగా 5,18, 202 క్యూసెక్కుల వరదనీరు దిగువ న సాగర్ కు విడుదలవుతోంది. శ్రీశై లం ప్రాజెక్టు (Srisailam project) 10 గేట్లను 10 అడుగు ల మేర ఎత్తి నీటిని దిగువకు విడు దల చేస్తున్నారు. శ్రీశైలంలో 5 లక్షకు పైగా క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమో దుకావటంతో నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు వేగంగా పెరుగుతు న్నాయి. మొత్తంగా 312 టీఎంసీ నిల్వ సామర్ధ్యానికి గాను సాగర్ లో ప్రస్తుతం 169.91 టీఎంసీల నిల్వ లున్నాయి.
శ్రీశైలం అవుట్ ఫ్లో (Srisailam outflow) ఇదే స్థాయిలో మరో వారం రోజులు కొనసాగితే సాగర్ కూడా గరిష్ట నిల్వ సామర్ధ్యానికి చేరవవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 3,09,600 క్యూసెక్కు ల వరద నీరు ఇన్ ఫ్లో రూపంలో వచ్చి చేరుతోంది. 215 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్ధ్యానికి గాను డ్యాంలో ప్రస్తుతం 208.72 టీఎంసీల నిల్వలున్నాయి. 885 అడుగుల నీటి మట్టానికి గాను జలాశయం 883.4 అడుగులకు చేరువయింది. శ్రీశైలం కుడి, ఎడమ పవర్ హౌస్ (Srisailam Right and Left Power House)ల్లో విద్యుదుత్పత్తి చేస్తుండటంతో దిగువకు 70 వేల క్యూసెక్కుల నీరు విడుదలవు తోంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపా డు హెడ్ రెగ్యులేటర్ కు 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మరో 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.