అయ్యో పాపం…. అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం
ప్రజా దీవెన /యాదాద్రి భువనగిరి : ఆధునిక యుగంలో కూడా మానవత్వం మంటకలుస్తుంది. సాంకేతికత పరుగులు పెడుతుంటే మనుషుల మానవత్వo పాతాళానికి తొక్కబడుతోoది. ఇటువంటి హృదయ విదారక సంఘటన కు సాక్షాత్కరంగ నిలుస్తుంది యాదాధ్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసింది. అప్పుడే పుట్టి శరీరం పై మానము పొర సైతం పూర్తిగా తొలగక ముందే, కళ్ళు తెరవకముందే మృత శిశువుగా మారిన విచారకర ఘటన చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపల్ పట్టణపరిధిలో శనివారం ఆప్పుడే పుట్టిన శిశువు మృత దేహం లభించింది. సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని బాబు జగ్జీవన్ రావు భవనం సమీపంలో గల చముళ్ళపొదల చాటున ఓ మహిళలకు శిశువు మృతదేహం కనిపించింది. బాగారం లావణ్య అనే మహిళ పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో బిఎస్పి సమావేశానికి హాజరై సమావేశం పూర్తి కావడంతో సమావేశ మందిరం నుండి బయటికి వెళ్తున్న సమయంలో పక్కనే కుక్కలు అప్పుడే పుట్టి మృతి చెందిన ఆడ శిశువును పీక్కతింటున్నట్లు గమనించింది. కుక్కలను వెళ్లగొట్టి చూడగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు గమనించారు. ఆ మహిళ వెంటనే భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పట్టణ ఇన్స్పెక్టర్ సుధీర్ కృష్ణ సందర్శించి మృతదేహాన్ని పరిశీలించి ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరిస్తు చుట్టూ పక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజలని విచారణ కొనసాగించారు. శిశువు మృతదేహం ఎక్కడి నుండైనా తెచ్చి ఇక్కడ పడేశారా? అనే కోణం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. శిశువు మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.