Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vishal: నటుడు విశాల్ కు కోర్టు మొట్టికాయ

–కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
— కోర్టు ధిక్కరణ కేసులో తాజాగా విశాల్ కు చుక్కెదురు

Vishal: ప్రజా దీవెన, చెన్నై: కోలీవుడ్ ప్రము ఖ నటుడు విశాల్‌పై (Vishal) మద్రాస్ హైకో ర్టు (Madras High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా తీస్తానని విశాల్ తమ నుంచి రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నా డని, ఆ డబ్బు లు ఇప్పటికీ ఇవ్వ డం లేదంటూ 2022లో లైకా ప్రొడ క్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయిం చింది. విచారణ సందర్భంగా లైకా సంస్థకు విశా ల్ రూ.15కోట్లు డిపా జిట్ చేయా లని, తన ఆస్తి వివరా లను సమ ర్పించాలని విశాల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

అప్ప టి వరకు ఆయన నటించి, నిర్మిం చిన సినిమాలేవీ థియేటర్లలో కానీ, ఓటీటీల్లో (ott) కానీ విడుదల చేయకుం డా స్టే విధించింది. అయితే, కోర్టు తీర్పు ను ఉల్లంఘించారని, డబ్బు లు డిపాజిట్ చేయకపోవడమే కాకుం డా ఆయన నటించి, నిర్మిం చిన సినిమాలను కూడా విడుదల చేశారంటూ ఈ ఏడాది జూన్‌లో లైకా సంస్థ మరోమారు కోర్టును ఆశ్రయిస్తూ విశాల్‌పై కోర్టు (court)ధిక్కరణ కేసు వేసింది. అయితే, అప్పుడు ఆధారాలను చూపించడంలో సంస్థ విఫలం కావడంతో విచారణ పలు మార్లు వాయిదా పడింది.తాజాగా, ఈ కేసులో విశాల్ తన వాదనలు వినిపించేందుకు కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా లైకా సంస్థతో (With the Leica company)జరి గిన ఒప్పందంపై విశాల్‌ను కోర్టు ప్రశ్నించింది. అయితే, అది తన దృష్టికి రాలేదని, ఖాళీ పేపర్‌పై సంతకం మాత్రమే చేశానని బదు లిచ్చారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ కాగి తంపై మీరెలా సంతకం చేస్తారని ప్రశ్నించారు.

తెలివిగా సమాధానం చెబుతున్నానని అనుకోవద్దని, ఇది మీ సినిమా షూటింగ్ (Film shooting) కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తెలివి ప్రదర్శించవద్దని, జాగ్రత్తగా బదు లివ్వాలని సూచించారుఆ తర్వాత ‘పందెంకోడి 2’ విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చా రా అని కోర్టు ప్రశ్నించగా విశాల్ సమాధానం ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో న్యాయమూర్తి మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రవర్తిస్తే కుదరదని, అవుననో, కాదనో సమాధానం చెప్పాలని ఆదేశించారు. దీంతో విశాల్ (vishal) నోరు తెరి చారు. లైకా నుంచి డబ్బు అప్పుగా తీసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించారు.