Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kacham Krishnamurthy: సాయుధ పోరాట ధ్రువ తార కాచం కృష్ణమూర్తి

–వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య

Kacham Krishnamurthy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరా ట యోధులు వ్యవసాయ కార్మిక సంఘ నేత కామ్రేడ్ కాచం కృష్ణమూ ర్తి (Kacham Krishnamurthy)పోరాట స్ఫూర్తితో ప్రజలు భూ పోరాటానికి సిద్ధం కావాలని వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్య దర్శి నారి ఐలయ్య (Nari Ailaiah) పిలుపునిచ్చా రు. కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి 18వ వర్ధంతి నల్లగొండ దొడ్డి కొమరయ్య భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లా డుతూ కాచం కృష్ణమూర్తి దోపిడి పీడన అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర తెలంగాణ రైతాం గ సాయుధ పోరాటంలో పేదల కో సం కూలీల కోసం రైతుల కోసం భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం రాచరిక పాలన వ్యతిరేకంగా నల్లగొండ జిల్లాలో విరోచితంగా పోరాడారని కొనియాడారు.ఉమ్మడి జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటు వంటి జనగాం తాలూకా కార్యచర ణ ఆయన అంకితభావానికి నిలువె త్తి నిదర్శనం అని అన్నారు.కాచం కృష్ణమూర్తి బాల్యం నుంచి పోరు బాటను ఎంచుకుని ఆయన ఎన్నడు వెనుదిరిగి తిరిగి చూడ లేదు.

ఐలమ్మ (Nari Ailaiah) భూ పోరాటం తదుపరి సాగిన ఊరేగింపు (procession)పై గుండాలు సాగించిన కాల్పులకు నేలకొరిగిన దొడ్డి కొమరయ్య ఉదాంతం ఆయన జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. పేదల పట్ల భూస్వాములు సాగిస్తున్న దౌర్జ న్యాలపై తిరగబడేలా చేసింది అప్పటినుంచి అమరుడయ్యే వరకు నమ్ముకున్న సిద్ధాంతాన్ని వీడని గొప్ప వ్యక్తి అని అన్నారు, జమీందారు దొరలకు వ్యతిరేకంగా గ్రామాలలో ప్రజలను చైతన్య పర చడం అడవుల్లో దళాలు నడ పడం భూ పోరాటం (Land struggle)నిర్వహించడంలో సంఘాన్ని విస్తరింప చేయ డంలో మిలిటరీ క్యాంప్లపై దాడి చేసి ఆయుధాల సేకరణ ఆయన రోజువారి కార్యక్ర మంలో భాగం అని అన్నారు అజ్ఞా తంలో రాగన్నగా పిలవ బడినారు ఆయన ఒక పోరాట దిక్సూచిగా పేరుపొందిన నాయకుడు విప్లవోద్యమం లోఅలు పెరుగని పోరాట యోధునిగా ఉన్న కాచం కృష్ణమూర్తి ఆశయ సాధన కోసం నేటి యువతరం సిద్ధం కావా లని పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరలు కనుగొనగా కనీస వేతన జీవో సవరించి కొత్త జీవోను తీసు కొచ్చి గ్రామాలు కనీస వేతనాలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపి ఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ, ప్రజాసంఘాల నాయకులు పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, బొల్లు రవీందర్, శివ తదితరులు పాల్గొన్నారు.