–ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్
Palakuri Ravi Goud:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని D39, D40 కాలువలకు వెంటనే సాగు నీటిని విడుదల (Release of cultivation water) చేయాలని, ఉదయ సముద్రం రిజర్వాయర్ నుండి d39 d40 కాలువల ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేసి చెరువులు కుంటలు నింపి రైతాం గాన్ని ఆదుకోవాలని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ (Palakuri Ravi Goud) ప్రభు త్వాన్ని కోరారు.గత యాసంగి సీజన్ లో బోర్లు,బావుల ద్వారా సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. D39, D40 కాల్వల ద్వారా నీటిని విడుదల చేసినట్లయి తే చెరువులు కుంటలు నుండి వాటి పరిధిలో ఉన్నటువంటి బోరు,బావు లలో నీరు చేరడంతో వరి పంటలు సాగుకు అనుకూలంగా ఉంటుందని ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టి లోకి తీసుకొని సాగునీటిని విడుదల (Release of cultivation water)చేయాల్సిందిగా కోరారు.