–సీఎం రేవంత్‌తో భేటీలో ఆనంద్ మహీంద్రా అంగీకారం
Anand Mahindra: ప్రజా దీవెన, హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో (Young India Skill University)ఆటోమోటివ్ విభాగాన్ని దత్తత తీసుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అంగీకరించారు. త్వర లోనే తన సంస్థకు చెందిన బృం దాన్ని యంగ్ ఇండియా స్కిల్ యూ నివర్సిటీ (Young India Skill University)పరిశీలనకు పంపుతాన న్నా రు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయిన ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)ఈ మేర కు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర అంశాలపైనా సీఎంతో ఆయన చర్చించారు. హైదరాబాద్‌లోని క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరణ కూ ఆయన ముందుకొచ్చారు. ఇదిలా ఉండగా అమెరికా కాన్సు లేట్ జనరల్ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.