Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Inside and outside are against me…! ఇంటా బయటా నాకు వ్యతిరేకమే…!

-- గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంటా బయటా నాకు వ్యతిరేకమే…!

— గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రజా దీవెన/హైదరాబాద్‌:ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని బిజేపి ఎమ్మేల్యే రాజాసింగ్ నర్మగర్భ వాఖ్యలు చేసారు. భారతీయ జనతా పార్టీ (bjp) బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (mla rajasingh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్‌ సూత్ర ప్రాయంగా చెప్పకనే చెప్పారు. రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీ(assembly)  కి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు( statements) చర్చనీయాంశమయ్యాయి. మ‌హ్మద్ ప్రవ‌క్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను బీజేఎల్పీ నేత రాజాసింగ్‌పై గతేడాది ఆగస్టు 23న బీజేపీ స‌స్పెన్షన్( suspension) వేటుపడిన విషయం తెలిసిందే. పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చ‌ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. శాస‌న స‌భాప‌క్ష (assembly bjp party vip) ప‌ద‌వినుంచి కూడా తొల‌గించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు (party activities)దూరంగా పెడుతూ వస్తున్న విషయం కూడా విధితమే.