Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Delhi: ఢిల్లీలో చిన్నారుల మృతి కలకలం

–20 రోజుల్లో 14 మంది చిన్నారుల మృతి
–ఢిల్లీలోని ఓ మానసిక వికలాంగు ల ఆశ్రమంలో ఘటన

Delhi: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీలోని (Delhi)ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 20 రోజుల వ్యవధిలో 14 మంది చిన్నారులు మృతి చెందడం కలక లం రేకెత్తిస్తోంది. వారి మరణాలకు కారణాలేంటన్నది ఇంకా తెలియక పోవడం గమనార్హం. రోహిణి ప్రాం తంలో ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) మానసిక వికలాంగుల కోసం ఆశాకిరణ్‌ షెల్టర్‌ హోం నడుపుతోంది. అయితే గత 20 రోజుల్లోనే ఈ షెల్టర్‌లో ఉంటు న్న వారిలో 14 మంది మృత్యువాత పడడంతో ఆందోళన చెలరేగింది.

ఈ మరణాలపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (Lieutenant Governor of Delhi)(ఎల్‌జీ) వీకే సక్సేనా విచా రణకు ఆదేశించారు. అలాగే ప్రభు త్వం ఆధ్వర్యంలో నడిచే అన్ని షెల్ట ర్‌ హోంలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతా ధికారులను ఎల్‌జీ ఆదేశించినట్లు రాజ్‌నివాస్‌ వెల్లడించింది. షెల్టర్‌లో మరణాల వ్యవహారంలో అధికారు ల నిర్లక్ష్యం ఉందని తెలిస్తే సహించ బోమని ఢిల్లీ మంత్రి అతిశీ (Minister Atishi) తెలి పారు. ఘటనపై మెజిస్ట్రియల్‌ దర్యాప్తుకు ఆదేశించామని, 24 గంటల్లో ప్రాథమిక నివేదిక వస్తుం దని చెప్పారు. మరణాల నేపథ్యం లో ఆప్‌ ప్రభుత్వం మీద జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ మండిపడ్డారు. కాగా, బీజేపీ నేతలు ఆశాకిరణ్‌ షెల్టర్‌ హోం వద్ద ఆందోళన చేపట్టారు. షెల్టర్‌లో పిల్ల లకు శుభ్రమైన నీరు, సరిపడా భో జనం, వైద్యం అందించడం లేదని తమకు తెలిసిందని బీజేపీ నేతలు (BJP leaders) పేర్కొన్నారు.