Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: విదేశీ పర్యటనలో సీఎం రేవంత్

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్ : రాష్ట్రా నికి కొత్త పెట్టుబడులను ఆకర్షించ డం కోసం ముఖ్యమంత్రి ఎ.రేవం త్‌రెడ్డి (CM Revanth Reddy)విదేశీ పర్యటనకు (Foreign trip) బయల్దేరా రు. శనివారం శంషాబాద్‌ నుంచి ఆయన అమెరికా బయల్దేరి వెళ్లా రు. ఆయన వెంట మంత్రి డి.శ్రీధర్‌ బాబు, సీఎస్‌ శాంతికుమారి (Minister D. Sridhar Babu, CS Shantikumari)కూడా ఉన్నారు. న్యూజెర్సీ, వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సి స్కో (New Jersey, Washington DC, New York, San Francisco Sch)తో పాటు దక్షిణ కొరియా సియోల్‌ నగరంలోనూ రేవంత్‌ బృందం పర్య టించనుంది.తన పర్యటనలో భా గంగా తొలుత ఈనెల 4న న్యూ జెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణీ యులతో జరిగే సమావేశంలో ఈ బృందం పాల్గొంటుంది. 5, 6 తేదీల్లో న్యూయార్క్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నా రు.