–కుల గణన తర్వాతనే పంచాయ తీ ఎన్నికలు నిర్వహించాలి
–భారతీయ జనతా పార్టీ వైఖరిని తక్షణమే వెల్లడించాలి
Community of BC: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పంచా యతీ ఎన్నికలు కులగణన పూర్త యిన తర్వాతే నిర్వహించాలని డిమాండ్ (demand) చేస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమo చేపట్టి అనంతరం నల్లగొండ జిల్లా కలెక్టర్ కి విన తిపత్రం సమర్పించారు బీసీ సంఘం (Community of BC)నాయకులు.అనంతరం విలేక రుల సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ సోలేటి ప్రభాకర్, జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, నల్లగొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ లు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ ఎన్నికల మేనిఫెస్టోలో కామా రెడ్డి బీసీ డిక్లరేషన్ లో శిలాశాస నాలు అనే పేరు ప్రకటించినట్లు తక్షణమే కులగణన (Census)చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రకటించిన ట్లుగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో పెంచాలని, కోరు చున్నామని, కేంద్ర ప్రభుత్వం కుల గణన అంశాన్ని హేళన చేసే విధం గా కులాలు లేని వారే కుల గణన అంశాన్ని కోరుతున్నారనే వ్యాఖ్యల ను నిరసించాలని కోరారు. ఈనెల 3 తేదీ నుంచి జాతీయ బీసీ సంక్షే మ సంఘం టైగర్ ఆర్ కృష్ణ అన్న ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసనకై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association)రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారా యణ పిలుపుమేరకు జరిగే నిరసనతెలిపారు. తక్షణమే కుల గణన షెడ్యూలు ప్రకటించాలి. ఇచ్చిన హామీ మేరకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచి తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిం చాలి. దీనిపై బిజెపి రాష్ట్ర పార్టీ తమ వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఇందుకే పెంచిన బీసీ రిజర్వేషన్లు 42 శాతం అన్ని రంగాలలో అమలకై షెడ్యూలు 9లో పెట్టి పార్లమెంటులో ఆమోదింప చెయ్యాలి. బీసీల ధర్నా తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని కుల గణన తర్వాతనే పంచాయతీ ఎన్ని కలు నిర్వహించాలని కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration) ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పై డిమాండ్లపై బిజెపి పార్టీ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) నల్లగొండ అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిం చడం అయినది. ఈ ధర్నా కార్యక్ర మానికి రిటైర్డ్ ఐఏఎస్ సొల్లేటి ప్రభాకర్ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీపీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతా లు సంఘీభావం ప్రకటించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పై డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీసీలందరూ సన్నద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు మునస ప్రసన్నకుమార్, కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్, చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, యాదవ రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షుడు చల్లా కోటేష్ యాదవ్, నల్లగొండ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కమ్మంపాటి శంకర్ దుర్గ, యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి వేణు యాదవ్, చెరుపల్లి సదానంద్, నాగరాజుగౌడ్, సింగం సత్యనారాయణ, కొండ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.