*పిల్లలలో రోగనిరోధక శక్తి మానసిక వికాసం సమగ్ర అభివృద్ధి జరుగుతుంది
Vasavi Youth Club:ప్రజాదీవెన, కోదాడ:శనివారం పుష్య నక్షత్రాన్ని పురస్కరించుకొని కోదాడ వాసవి యూత్ క్లబ్ (Vasavi Youth Club)ఆధ్వర్యంలో పిల్లలకు ఉచిత స్వర్ణప్రాసన పంపిణీ (Distribution of free golden prayer) కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ పరిధిలోని తమ్మర లో డాక్టర్ సురేష్ జకోటియా హా స్పటల్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ (suresh)జకోటియా మాట్లాడుతూ 16 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ స్వర్ణప్రాసన మందు పంపిణీ జరుగుతుందన్నారు ఈ మందు పిల్లలకు (kids)ఇవ్వడం వల్ల పిల్లలలో రోగ నిరోధక శక్తి మానసిక వికాసము సమగ్ర అభివృద్ధి పెరుగుతుందన్నారు ఈ ఈ కార్యక్రమంలో వంద మంది పిల్లలకు స్వర్ణప్రాసనమందును ఉచితంగా అందజేశారు.ప్రతి పుష్య నక్షత్రం రోజున ఈ స్వర్ణప్రాసన మందును పిల్లలకు అందించే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నించాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు వంగవీటి భరత్ చంద్ర ,గడ్డం శ్రీ లక్ష్మీ ప్రసన్న.వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు ఇమ్మడి అనంత చక్రవర్తి, ఐపిసీ పబ్బగీత, యాదారాణిచక్ర శ్రీ, మేఘనాథ్, భరత్ ,ఓరుగంటి నిఖిల్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు