–సీఎం రేవంత్‌కు రుణపడి ఉంటాం
— రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ
Damodara Rajanarsimha: ప్రజా దీవెన, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ చట్ట (SC Classification Act) రూపం దాల్చేవరకు కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి దామెదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) అన్నారు. రాష్ట్రాలు వర్గీకరణను చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని బేగంపేట ప్లాజా హోటల్లో ‘ఎస్సీ వర్గీకరణ, మాదిగ ల భవిష్యత్’ అనే అంశంపై మాదిగ ప్రజా ప్రతినిధులు, నేతల సమావే శం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దామో దర మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాతో (Siddharth Luthra) సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించడం వల్లే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ను అమలు చేస్తామన్న సీఎంకు (cm) రుణపడి ఉంటామన్నారు. ఎస్సీ వర్గీకరణకు నిపుణులతో కమిటీ వేసి ఆర్డినెన్స్ తేవాలని ఆయన్ను కోరతామని చెప్పారు. మాదిగల సమ్మేళనం (Madigala compound) పేరుతో ఈనెల 16 లేదా 17వ తేదీల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సీఎంను ఆహ్వానించి.. సన్మానించనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి మోత్కు పల్లి నర్సింహులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను( SC Classification Act) సమైక్య ఆంధ్రప్ర దేశ్‌లో అమలు చేసి మాదిగ జాతికి చంద్రబాబు ఎంతో మేలు చేశార న్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే లు వేముల వీరేశం, మందుల సామేల్, కవ్వంపల్లి సత్యనారా యణ, కాలె యాదయ్యతో పాటు పలువురు దళిత నేతలు పాల్గొ న్నారు.