Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Madhyapradesh : పురాతన గోడ కూలి ఘోరం

–తొమ్మిది మంది చిన్నారులు దుర్మరణం
–మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో పెను ప్రమాదం

Madhyapradesh : ప్రజా దీవెన, మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్ (Madhyapradesh)రాష్ట్రంలో ఘోర దుర్ఘటన జరిగింది. భారీ వర్షాలు నేపథ్యంలో పురాతనమైన గోడ (Ancient wall)ఒకటి కూలి ఏకంగా తొమ్మిది మంది చిన్నారులు దుర్మరణం పాలైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్లో చోటుచేసుకుంది. శివలింగాన్ని తయారు చేయడానికి షాపురా ప్రాంతంలోని హర్దోయ్ శివాలయం వద్ద పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యా ర్థులు గుమిగూడారు. అక్కడ సావ న్ మాసంలో శివుని ఆరాధనతో పాటు భగవత్ కథ కూడా నిర్వహి స్తారు. విద్యార్థులు శివలింగాన్ని తయారు చేస్తున్న ఆలయ ప్రాంగ ణానికి సమీపంలోనే మల్లు కుష్వా హ అనే వ్యక్తికి పురాతనమైన ఇల్లు ఉంది. ఆ క్రమంలోనే భారీ వర్షాలకు 50 ఏళ్ల నాటి ఇంటి గోడ ఆకస్మాత్తు గా కూలిపోయి పెను ప్రమాదం సం భవించింది. ఈ ఘటనలో 9 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌ లోని సాగర్‌లో చోటుచేసుకుంది. మర ణించిన వారిలో 10 నుంచి 14 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు.

రూ.2 లక్షల సాయం సమాచా రం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై విషయం తెలుసుకు న్న మాజీ మంత్రి గోపాల్ భార్గవ ఘటనా స్థలానికి చేరుకుని సహా యక చర్యలు త్వరగా ప్రారంభిం చాలని ఆదేశించారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమం త్రి డాక్టర్ మోహన్ యాదవ్ (Dr. Mohan Yadav)బాధి తుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రక టించారు.

ఇదిలా ఉండగా ఆదివారం కావడంతో సాగర్‌లోని పాఠశాలలకు సెలవు. దీంతో శివలింగాన్ని తయారు చేసేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ ఘటనలో మరణిం చిన చిన్నారుల్లో దివ్యాన్ష్, వంశ్, నితేష్, ధ్రువ్, దివ్యరాజ్, సుమిత్ ప్రజాపతి, ఖుషి, పర్వ్ విశ్వకర్మ అనే అమాయక చిన్నారులు ఉన్నారు. అదే సమయంలో గాయపడిన వారిలో కొంతమంది పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, వారికి చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలి పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు (police)విచారణ చేస్తు న్నారు.

అదేవిధంగా మరో ఘటనలో
మరో ఘటనలో ఓ జీప్ ట్రక్కును (Jeep truck) ఢీ కొనడంతో ఇద్దరు మహిళా కార్మి కులు మరణించారు. మరో ఏడు గురు గాయపడ్డారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సి యోని బాలాఘాట్ రోడ్డు సమీపం లో శనివారం రాత్రి ఈ ఘటన జరి గినట్లు పోలీసులు తెలిపారు. కూలీ లు ఉమర్వాడ నుంచి ధర్నాకలా గ్రామంలో వరిపంట పనులకు వెళ్లి ఇళ్లకు తిరిగి వస్తుండగా ట్రక్కును వారి జీపు ఢీకొట్టింది. వరుస ప్ర మాదాల నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందు తున్నారు.