–ఉద్యమకారులు అనారోగ్యం పాలై మరణించిన వారికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా
–ఆరు గ్యారంటీలలో భాగంగా 250 గజాల ఇంటి స్థలం
–రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్
Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)ప్రజా దర్బా ర్ కార్యక్రమంలో భాగంగా మంత్రి ని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ (Madi Vijay Kumar) ఆధ్వ ర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు గౌరవ వేతనం 25 వేల రూపాయ లు, హెల్త్ కార్డు, బస్సు మరియు రైలు పాసులు, ఉద్యమంలో పాల్గొని అనారోగ్యం పాలై మరణించిన వారికి 10 లక్షల ఎక్స్ గ్రేషియాతో (with ex gratia)పాటు వారి కుటుం బంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించడంతోపాటు ఎఫ్ ఐ ఆర్ ఉన్న వారికి మరియు ఎఫ్ ఐ ఆర్ లేని వారికి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కేసులతో సంబంధం లేకుండా వారందరికీ న్యాయం చేయాలని మంత్రి ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నామిరెడ్డి నరసింహారెడ్డి,జిల్లపల్లి ఇంద్ర, అయితగోని శేఖర్, కొండా పురుషోత్తం, వంగూరి వెంకటేశం, కాశి మల్ల యాదయ్య, కందిమల్ల సులోచన, భోగరి రామకృష్ణ, జిల్లపల్లి నాగరాజు, పురం రవి, పగిడిమర్రి నరేష్, ముజీబ్,నాగిరెడ్డి, బత్తుల నగేష్,మామిడి కేదార్, కాశీ మల్ల యాదయ్య, ఈసం విజయ్,జిల్లా యాదయ్య తదితరులు పాల్గొన్నారు.