–భారత అంధుల క్రికెట్ జట్టుతో సీఎం రేవంత్
CM Revanth:ప్రజా దీవెన, న్యూయార్క్: జీవి తంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్ప బలం మనలో ఉండటం ప్రధా నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth)అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూయార్క్ నగరంలో భారత అంధుల క్రికెట్ జట్టు క్రీడాకారులను (Cricket team players) కలుసుకు న్నారు. వారిని కలుసుకున్న సంద ర్భం తనకు లభించిన ఒక అమూ ల్యమైన అవకాశంగా భావిస్తున్నా నని ముఖ్యమంత్రి అన్నారు. వారితో ఆప్యాయంగా కొద్దిసేపు ముచ్చటించారు. జీవితంలో ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని (Mental stability)వారి నుంచి నేర్చుకోగలమన్నారు. వారిలోని స్పూర్తిని అభినందిస్తూ వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.